అదిరిపోయే లుక్ తో టాటా సఫారి కారు లాంఛ్.. ధర ఎంతంటే?
కొత్త లుక్‌లో టాటా సఫారీ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు సఫారీని లాంచ్ చేస్తున్నట్లు టాటా సంస్థ ప్రకటించింది. గత నెలలో ఈ వెహికిల్‌ను ఆవిష్కరించిన సంస్థ.. ఈ నెల ప్రారంభం నుంచి రూ.30 వేలకు బుకింగ్స్ కూడా తీసుకుంటోంది. వెహికిల్‌ను లాంచ్ చేసిన వెంటనే దీని ధరను కూడా ప్రకటించనున్నారు. ఈ ఎస్యూవీ ధర ఎంత అన్నదానిపై కంపెనీ ఇప్పటి వరకూ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీని ప్రారంభ ధరనే రూ.18 లక్షలు గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్లో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎంజీ హెక్టార్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, జీప్ కంపాస్‌లతో సఫారీ పోటీ పడనుంది.
ఈ కారు 9 రకాల రంగుల వేరియంట్ లలో అందుబాటులో ఉంది..ఇందులో ఎక్స్ఈ అనేది బేస్ వేరియంట్. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, అన్ని డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇక ఆ తర్వాతి వేరియంట్ అయిన ఎక్స్ఎంలో మల్టీ డ్రైవ్ మోడ్లు, టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి. ఇక తర్వాతి ఎక్స్‌టీ మోడల్లో ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తోపాటు పనోరమిక్ సన్‌రూఫ్ ఉండనున్నాయి. టాప్ మోడల్ అయిన ఎక్స్‌జెడ్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ తదితర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.. మొత్తానికి ఈ కారు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో మార్కెట్లోకి రానుంది. మరి సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి..