అమెరికా లో కార్లకు మంచి డిమాండ్ ఉంది. మన దేశం తో పోలిస్తే అధ్బుతమైన ఫీచర్స్ తో పాటుగా ఆకట్టుకొనే రేంజు లో ఉంటాయి.. దాంతో వాటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఈ కారును అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం అధికార వాహనం 'ది బీస్ట్'లో ప్రయాణిస్తారు. అత్యంత కట్టు దిట్టమైన భద్రత కలిగిన సరికొత్త కాడి లాక్ ఆధారిత మోడల్ లిమోను 2018లో ట్రంప్ హయాం లో ఆ దేశ సీక్రెట్ సర్వీస్ లో ప్రవేశపెట్టారు.
2009 నుంచి అమెరికా అధ్యక్షులు వరుసగా వాడిన ఈ కారు స్థానంలో ఇప్పుడు సరికొత్త ఫీచర్ల తో కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ప్రపంచం లోనే ప్రత్యేకమైన బీస్ట్ 2.0 కారు విశేషాలు ఇవే..
బీస్ట్ 2.0ను తయారు చేసిన జనరల్ మెటార్స్ సీక్రెట్ సర్వీస్‌కు రెండు వాహనాలు అందించింది.
లిమోకు సొంత విమానం ఉన్నది. అమెరికా అధ్యక్షుడు వెళ్లే ప్రతి చోటుకు సి -17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం ద్వారా ఈ కారును తరలిస్తారు.
పాత బీస్ట్ కారు 14,000 నుండి 20,000 పౌండ్ల మధ్య బరువు ఉండగా, కొత్త బీస్ట్ తేలికైనది. బరువు, పరిమాణం కారణంగా 5 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. పాత బీస్ట్ 3 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని నివేదికల ద్వారా తెలుస్తున్నది.
ఉపగ్రహ ఫోన్, న్యూక్లియర్ కోడ్‌ల తో పాటు రన్-ఫ్లాట్ టైర్లు, నైట్ విజన్ గేర్, ఆక్సిజన్ సరఫరా వంటి భద్రతా చర్యలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రంట్ బంపర్ నుండి గ్యాస్ షెల్స్‌ను ఫైర్ చేస్తుంది. వీటితో పాటుగా లోపల ఉన్న వ్యక్తి తన సేఫ్టీ తానే చూసుకోవడానికి అన్నీ రకాలా వేపన్లు కూడా ఉంటాయి. ఈ కారు రేటు కూడా తారాస్థాయికి చేరుకుంది.