కొత్త మోడల్ ని లాంచ్ చేసిన ఎంజీ హెక్టార్... ఫిదా అయిపోతున్న కార్ లవర్స్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఎంజీ మోటార్స్ కార్లు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో సాకర్యంగా, లగ్జరీగా ఉంటాయి. భారత మార్కెట్లో అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తోన్న ఈ సంస్థ నుంచి విడుదలైన ఎంజీ హెక్టార్ మోడల్ ఎంత విజయవంతమైందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ కారు కొత్త వర్షన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది ఎంజీ మోటార్స్ కంపెనీ. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త ఎంజీ హెక్టార్ ప్రారంభ ధర వచ్చేసి రూ.12.89 లక్షలు ఉంది. మొదటి వర్షన్ విడుదలైన 18 నెలల తర్వాత కొత్త ఫేస్ లిఫ్ట్ ను భారత మార్కెట్లో  లాంచ్ చేసింది ఎంజీ మోటార్స్ కంపెనీ...టాప్ వేరియంటైనా షార్ప్ మోడల్ వచ్చేసి రూ.18.32 లక్షలుగా కంపెనీ ధరని నిర్ణయించింది. ఈ కారులో మెయిన్  హైలెట్ ముందువైపున్న గ్రిల్.ఎంజీ హెక్టార్ మోడల్లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి 143 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ను కూడా కిలగి ఉంది.

 ఇది 174 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 350 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 48 వోల్టుల మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ ఫ్యూయల్ ఎఫిషియంట్ ను ఇచ్చింది. 6-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పాటు నాన్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ డీసీటీ ట్రాన్స్ మిషన్ యూనిట్ తో పనిచేస్తుంది.ఇంటిరీయర్ గమనిస్తే నలుపు రంగుతో పాటు యూఎస్బీ ఏ-టైపు ఛార్జింగ్ స్లాట్స్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జెర్ తో పాటు ఫ్రంట్ గెర్ లీవర్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వాయిస్ వోవర్ కమాండ్ ఆప్షన్ ఈ కారులో ఉన్న మరో ప్రత్యేకం. భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా టాటా హ్యారియర్, నిసాన్ కిక్స్ లాంటి వాహనాలు ఉన్నాయి.ఈ సరికొత్తే ఫేస్ లిఫ్ట్ లో ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, ఫుల్ ఎల్ఈడీ హెడ్ లైట్ సెటప్, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్. బ్లాకెడ్ ఓఆర్వీఎం లాంటి అదనపు ఇండిగ్రెటెడ్ ఇంటికేటర్లు కెమేరా 360 డిగ్రీల కెమేరా లాంటి ప్రత్యేకతలు దీని సొంతం.

ఇవి కాకుండా 18-అంగుళాల డ్యూయల్ టోన్ వీల్స్ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా జెడ్ఎస్ ఈవీ లాంటి భారీ వాహనంలో మాదిరి ప్రత్యేకతలు ఈ ఎస్ యూవీలో ఉన్నాయి. ఇందులో మరో మార్పు వచ్చేసి రిఫ్లెక్టివ్ స్ట్రిప్ తో పాటు రెండు వైపులా కనెక్ట్ చేసుకునే టెయిల్ లైట్లు, ఎస్ యూవీ ప్రిఫేస్డ్ మోడల్ ఇందులో ఉన్నాయి.ఇక ఇలాంటి మరెన్నో కొత్త కొత్త ఆటోమొబైల్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: