ప్రముఖ ఫోర్ వీలర్ వాహన సంస్థ జీప్ సరి కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
దసరా ,
దీపావళి పండుగ సీజన్ సందర్బంగా అదిరిపోయే ఆఫర్లను ప్రముఖ కంపెనీలు అందించాయి.. తాజాగా ఈ జీప్ కంపెనీ కూడా క్రిస్టమస్ , నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్ల తో జనాల ముందుకు రాబోతుంది.జీప్ కంపాస్ ఎస్ యూవీ లోని వేరియంట్ల ఆధారంగా భారీ తగ్గింపులను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం జీప్ కంపాస్ మోడల్ ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది. స్పోర్ట్ ప్లస్, లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ ప్లస్, నైట్ ఈగెల్, హార్డ్ కోర్ ట్రైల్ హాక్ వేరియంట్లలో లభిస్తుంది.
రెండు లక్షల రాయితీ ఇవ్వడంతో పాటుగా క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది..లాయల్టీ బోనస్, యాక్సెసిరీస్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లు కేవలం ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొనుగోలు దారులు ఆన్ లైన్ లో ఈ ఎస్ యూవీని బుక్ చేసుకోవచ్చు లేదా దేశవ్యాప్తంగా ఉన్న జీప్ డీలర్ల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు.. మరో విషయం ఏంటంటే ఈ కంపెనీ కొత్త డిస్కౌంట్ లతో పాటుగా ఈ ఏం ఐ , మనీ స్కీమ్ తదితర వాటిని అందిస్తుంది..
ఈ కారు షో రూం లో ధర వచ్చేసి రూ. 16.49 లక్షలుగా సంస్థ నిర్ణయించింది..టాప్ వేరియంటైన లిమిటెడ్ ధర వచ్చేసి రూ.24.99 లక్షలుగా ఉంది. ట్రైల్ హాక్ వేరియంట్ ధర వచ్చేసి 26.80 లక్షలుగా ఉండగా.. ఇందులోని ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి 27.60 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. ఇకపోతే 1.4-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఇంజిన్ వచ్చేసి 160 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే 2.0 లీటర్ డీజిల్ యూనిట్ అయితే 173 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, అలాగే 350 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ మ్యానువల్ స్పీడ్ ను కలిగి ఉంది. ఈ కారుకు పోటీగా మార్కెట్ లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి.