టీవీ అమ్మకాల్లో దిగిన మరో స్మార్ట్ ఫోన్ సంస్థ.. తక్కువ ధరకే..

Satvika
మొదట మొబైల్ తో ప్రారంభించిన చాలా కంపెనీలు ఇప్పుడు టీవీ లు , ఇతరత్రా ఎలెక్ట్రానిక్ వస్తువులను తయారు చేస్తున్నారు. రియల్ మీ,మైక్రోమాక్స్, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పుడు మొబైల్ తో పాటుగా టీవీలు వంటి వాటిని తయారు చేస్తూ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మరో కంపెనీని టీవీ మార్కెట్లోకి విడుదల కానుంది.. ఆ టీవీ ఏంటో స్పెసిఫికేషన్ మొదలగు వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.. 



ఇండియా మార్కెట్లలో స్మార్ట్ ఫోన్ల నుండి స్మార్ట్ టీవీల అమ్మకాలు భారీగా జరిగే అవకాశం ఉంది. హాంగ్ కాంగ్ దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ ఫీనిక్స్ ఇండియాలో తక్కువ ధరకే మంచి ఫిచర్స్ ఉన్న స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ టీవీలు రెండు మోడళ్లలో లభ్యమవుతున్నాయి. ఈ టివిలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుందని కంపెనీ వెల్లడించింది.. టీవీ ధరను చూస్తే..ఇన్ ఫీనిక్స్ 32ఎక్స్1, 43ఎక్స్ మోడళ్లను విడుదల చేసింది.



మరో ముఖ్య విషయం చెప్పాలి..టీవీలలో మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ తోపాటు 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ స్పేస్ సమాచారాన్ని స్టోరేజ్‌ చేసుకునే సదుపాయాన్ని వీటిలో పొందుపరచారు. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్‌బీ పోర్టు, బ్లూటూత్ 5.0, వైఫై, ఇన్ఫ్రా రెడ్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 32 అంగుళాల మోడళ్లలో ఉన్నాయి. ఇక 43 అంగుళాల టీవిలలో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, బ్లూటూత్ 5.0, వైఫై, బ్లూటూత్, ఐఆర్ రిమోట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు వంటి అన్నీ అధ్బుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది..

 టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ అనేది వస్తువుల నాణ్యతను మెరుగుపరచేందుకు అన్నీ రకాల టెస్టుల ను నిర్వహించే సంస్థ.. ధరను కూడా నిర్ణయించింది.. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను రూ.11,999గా, 43 అంగుళాల టీవీ ధర రూ.19,999 గా ప్రముఖ షో రూం నిర్ధారించింది. ఈ టీవీ ల క్లియర్ సేల్ అనేది ఈ నెల 18 నుంచి అందుబాటిలోకి రానుంది.. మరి టీవీ ఏ మాత్రం ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: