భారత దేశం ఇప్పుడు టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది.. కొత్త కొత్త ద్విచక్ర వాహనాలు సరి కొత్త ఫీచర్లతో సరసమైన ధరలతో మార్కెట్ లో సందడి చేస్తున్నాయి..ముఖ్యంగా దేశాన్ని కాలుష్య రహితంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా పెట్రోల్ ,డీజిల్ తో నడిచే వాటి కన్నా కూడా విద్యుత్ తో నడిచే వాహనాలను అందుబాటులోకి వచ్చాయి.. ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన సౌకర్యాలను అందిస్తుంది. ఇప్పటివరకు భారత దేశంలో విడుదలైన విద్యుత్స్కూటర్లు వాటి ప్రత్యేకతలను ఒకసారి చూసేద్దాం..
హీరో ఎలక్ట్రికా ఆప్టిమా..
విద్యుత్ స్కూటర్లన్నింటిలో అత్యంత ధర తక్కువైన విద్యుత్ స్కూటర్ హీరో ఎలక్ట్రికా ఆప్టిమా. ఈ వాహనాన్ని గతేడాది భారత విపణిలో విడుదల చేశారు. ఎక్స్ షోరూంలో దీని ప్రారంభ ధర రూ.41,770. గరిష్ఠంగా ఈ విద్యుత్ స్కూటర్ వెల రూ.68,721 వరకు ఉంది. హీరో ఆప్టిమా స్టాండర్డ్ వేరియంట్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టడానికి కేవలం 5 గంటల సమయం పడుతుంది..
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్..
ఈ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది.ఎక్స్ షోరూంలో ఈ టూ-వీలర్ ప్రారంభ ధర లక్ష రూపాయలు. బజాజ్ బైక్స్ లో అత్యంత విజయవంతమైన చేతక్ స్కూటర్ పేరును ఈ వాహనానికి పెట్టేసరికి దీని ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఈ స్కూటర్ 3.8 కిలోవాట్, 4.1కిలోవాట్ విద్యుత్ మోటార్లను కలిగి ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే దగ్గర దగ్గర 100 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు..
టీవీఎస్ ఐక్యూబ్...
టీవీఎస్ సంస్థ విడుదల చేసిన ఈ విద్యుత్ స్కూటర్ జనవరి 25న భారత మార్కెట్లో విడుదలైంది. బజాజ్ చేతక్ వచ్చిన కొన్ని రోజులకే ఈ స్కూటర్ విపణిలోకి రావడం గమనార్హం. మరో విషయమేంటంటే బజాజ్ లాంఛ్ చేసిన తొలి ఎలక్ట్రో స్కూటర్ ఇదేనట..ఒక్కసారి ఛార్జింగ్ పెట్టామంటే గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లవచ్చు..
వీటితో పాటుగా ఏథర్ 450ఎక్స్.. ఏథర్ 450 బైక్ లు కూడా విద్యుత్ వాహనాలే.. ఇవన్నీ కూడా భారత మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న విద్యుత్ ద్విచక్ర వాహనాలు..