ఇండియాలో టాప్ మైలేజ్ ఇస్తున్న కార్లు ఇవే..
భారత దేశంలో ఉన్న ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల విషయానికొస్తే..
మారుతి సుజికి డిజైర్..
ఈ కారు ఒక బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే..సెడాన్ సిగ్మెంట్లో ఫెస్ లిఫ్ట్ వర్షన్ అయిన ఈ కారు ధర కేవలం రూ.5.89 లక్షల నుంచి రూ.8.81 లక్షల మధ్య ఉంది. మైలేజి దగ్గరకొస్తే లీటరుకు గరిష్ఠంగా 23.26 కిలోమీటర్ల నుంచి 24.12 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. సాదా సీదా వ్యక్తులకు ఈ కారు సౌకర్యంగా ఉంటుంది..
హ్యుండాయ్ ఆరా..
2020 జనవరిలో సరికొత్త ఫీచర్లు రూపొందిస్తూ అందించారు..ఈ కారు ధర వచ్చేసి రూ.5.79 లక్షల నుంచి 9.22 లక్షల మధ్య ఉంది. లీటరుకు గరిష్ఠంగా 20.5 కిలోమీటర్ల మైలేజినిస్తుందీ వాహనం. హ్యుండాయ్ ఆరా 5 వేరియంట్లలో లభ్యం కానుంది..
టాటా టైగర్..
ఈ కారు ఆకర్షణీయమైన రంగు , మైలేజ్ ను కలిగి ఉంటుంది. స్టయిల్ గా ఉండటంతో ఈ కారుకు డిమాండ్ కూడా ఎక్కువే..ధర వచ్చేసి రూ.5.75 లక్షల నుంచి 7.49 లక్షల మధ్య ఉంది. లీటరుకుగరిష్ఠంగా 20.3 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుందీ వాహనం. ఇటీవలే ఈ వాహనాన్ని బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసింది టాటా సంస్థ.. అందుకే డిమాండ్ కూడా ఎక్కువే..
హోండా అమేజ్..
ఈ కారు కూడా ఇటీవలే మార్కెట్ లోకి విడుదల అయ్యింది.హోండా అమేజ్ ధర వచ్చేసి రూ.6.09 లక్షల నుంచి రూ.9.05 లక్షల మధ్య ఉంది. లీటరుకు గరిష్ఠంగా 18.6 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. ఫిబ్రవరిలో ఈ కారును బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసింది... దీనిని కొనడానికి కూడా మార్కెట్ లోకి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఫోర్డ్ యాస్పైర్..
మంచి కలర్ తో పాటుగా స్టయిల్ లుక్ తో ఉంటుంది.. అందుకే దీనికి డిమాండ్ కూడా ఎక్కవవుతోంది.. ఫోర్డ్ యాస్పైర్ ధర వచ్చేసి రూ.5.99 లక్షల నుంచి 8.34 లక్షల మధ్య ఉంది. లీటరుకు గరిష్ఠంగా 18.5 కిలోమీటర్ల మైలేజినిస్తుందీ వాహనం.
చూసారుగా ఈ కార్లు అన్నీ కూడా మంచి మైలేజ్ ను ఇస్తున్నాయి.. మీలో ఎవరైనా కార్లను కొనాలనుకునే వాళ్ళు ఈ కార్లలోని ప్రత్యేకతలు చూసి కొనుక్కోవచ్చు అని అంటారు.. వీటిని దృష్టిలో ఉంచుకుని కార్లను కొండం మంచిది..