టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి కార్ విడుదల... పూర్తి వివరాలు మీకోసం...!
ఈ కార్ లో ముఖ్యంగా... ముందు మరియు వెనుక వైపు బంపర్లను బాగా రీడిజైన్ చేశారు. దింతో ఇరువైపులా కొత్త ఫ్రంట్ గ్రిల్ అలాగే ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, డ్యూయల్ టోన్ రూఫ్ తో పాటు అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రముఖంగా ఉన్నాయి. ఇక అలాగే ఇంటీరియర్స్ విషయానికి వస్తే... ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మరింత స్పోర్టీ ఫీల్ ను అందిచనుంది. అలాగే, ఈ కార్ భద్రతను పెంచే అదనపు ఫీచర్లను పొందు పొడిచింది. ఇంకా ఇందులో 360 డిగ్రీల పానోరమిక్ వ్యూ మోనిటర్, ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ లాంటి అనేక అద్భుత ఫీచర్లు ఉన్నాయి.
వీటితో పాటు లెథర్ అప్‌హోలెస్ట్రీలో ఫినిష్ చేయబడిన కార్ సీట్లు మనకు లభించనున్నాయి. ఈ ఫీచర్లతో పాటు, కస్టమర్ల ఎంపిక మేరకు ఇందులో అనేక రకాల ఆప్షనల్ యాక్ససరీలను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో హెడ్ - అప్ డిస్ప్లే, ఒక టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, పడల్ ల్యాంప్స్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ లాంటి సదుపాయాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక కొత్త టొయోటా ఫార్చ్యూనర్ టిఆర్‌డి లిమిటెడ్ ఎడిషన్‌లో తక్కువ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉండనున్నాయి. అయితే ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో స్టాండర్డ్ ఫార్చ్యునర్ లో ఉపయోగించే 2.8 lr డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇక ఈ ఇంజిన్ 175 bhp శక్తిని, 420 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సీక్వెన్షియల్, పాడిల్ షిఫ్ట్ తో కూడిన 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగింది.