భారత ఆటో మొబైల్ రంగ టేకో సంస్థ నుండి కొత్త మోపెడ్ విడుదల..!

Kothuru Ram Kumar
భారతదేశానికి చెందిన ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టేకో ఎలక్ట్రిక్ మరోసారి సాధి అనే ఎలక్ట్రిక్ మోపెడ్ ను విడుదల చేసింది. ఇక ఈ మోపెడ్ ధర విషయానికి వస్తే ఏకంగా రూ 57,697 కంపెనీ నిర్ణయించింది. ఇది కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే కష్టమర్ కి లభిస్తుంది. అయితే ఈ మోపెడు మాత్రం వచ్చే నెల లో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం ఇప్పటికే బుకింగ్స్ ని ఆన్ లైన్ ద్వారా మొదలు పెట్టింది సంస్థ.

ఇక ఈ బైక్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దీని వెనుక భాగంలో లగేజ్ రాక్ అలాగే ముందు భాగంలో లగేజ్ బాస్కెట్ లాంటి కొత్త ఆవిష్కరణలను తీసుకువచ్చారు. ఇది ముఖ్యంగా ప్రోడక్ట్ డెలివరీ సర్వీస్ కు ఈ  ఎలక్ట్రిక్ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ స్కూటర్ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సరిపోతుంది. ఇందులో ఫ్లాట్ సీటును కంపెనీ పొందుపరిచింది. ఇక ఈ బైక్లో ఫీచర్ల విషయాని కొస్తే ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ రిపేర్ ఫంక్షన్ అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టం లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఈ బైక్ చార్జింగ్ విషయానికి వస్తే ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు.

ఇక ఈ బైక్లో 48వి 26 ఆంప్ లిథియం అయాన్ బ్యాటరీ తో పని చేయనుంది. ఇలా ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 25 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలరు. ఈ బైక్ లోని బ్యాటరీ ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఏకంగా మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటుంది. ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 1.5 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ లెక్క ప్రకారం 60 కిలోమీటర్ల రైడింగ్ కు 12 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఈ స్కూటర్ కేవలం 50 కిలోలు కన్నా తక్కువ బరువు ఉంటుంది. ఈ బైక్ కి ట్యూబ్ లెస్ టైర్ లతో కూడిన అల్లాయ్ వీల్స్ జతచేసే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: