బుగట్టి బేబీ-2 మోడల్ కార్... కేవలం పిల్లలకే

Kothuru Ram Kumar
గతేడాది తన 110వ వార్షికోత్సం సందర్భంగా బుగట్టి ఓ హామీ ఇచ్చింది. కేవలం పిల్లలకే పరిమితమయ్యే బుగట్టి బేబీ-2 ఎలక్ట్రికల్ మోడల్ కార్ ను తీసుకోస్తానని చెప్పింది. తాజాగా బుగట్టి బేబీ-2 కార్ ప్రొడక్షన్ మోడల్ ను తీసుకువచ్చారు. కాగా, గతేడాది బుగట్టి 3డీ ప్రింటెడ్ మోడళ్లను మార్కెట్ లో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ కార్ల తయారీ సంస్థ బుగట్టీ పిల్లలకు బుగట్టి బేబీ-2 కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ 500 యూనిట్లు మార్కెట్ లో విడుదల చేయగా 500 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఈ బుగట్టి బేబీ-2 కారును 1927లో విడుదలైన బుగట్టి బేబీ టాయ్ కారు పోలీ ఉంటుంది. ఈ బేబీ కార్ ఆధారంగానే బుగట్టి బేబీ-2ను రూపొందించారు. బుగట్టి బేబీ-2 కార్లను తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టినరోజు గిఫ్ట్ కు బాగా ఉపయోగపడుతాయి. బుగట్టి బేబీ-2 మోడల్ టైప్ 35 మోడల్ 75 శాతం ప్రతి రూప మోడల్ ఇది. ఇందులో రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు పొందుపర్చారు. కస్టమర్లకు అందుబాటులో ఉంచేలా బుకింగ్ సౌకర్యం కల్పించింది. యూరోలో ధర రూ.30,000, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 26.6 లక్షలు బుగట్టి బేబీ-2 ధర ఉంటుంది. టాప్ ఎండ్ మోడల్ ధర 58,500 యూరోలు, అదే ఇండియాలో రూ.50.7 లక్షలు.

బుగట్టి బేబీ-2 కారు బుగట్టి టైప్-35 కారుపై ఆధారపడింది. ఈ కారు ప్రపంచంలోనే  అత్యంత విజయవంతమైన రేసింగ్ కార్లలో ఒకటిగా పేరుపొందింది. ఇప్పటి వరకూ బుగట్టి బేబీ-2 బేస్, వెయిట్స్ మరియు పూర్ సెంగ్ అనే మూడు మోడళ్లు అమ్ముడవుతోంది. బేస్ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 45కి.మీ ప్రయాణించగా.. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసుకున్నట్లయితే 25 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. వినియోగదారులు సులభంగా బుకింగ్ చేసుకుని రద్దు చేసుకోవచ్చు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: