బిఎస్-6 హ్యుందాయ్ టక్సన్ ఎలా ఉందంటే..?
2020 బిఎస్ 6 మోడల్ హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ త్వరలోనే భారత్ లో ప్రారంభించనున్నారు.. హ్యుందాయ్ టక్సన్ గత కొన్ని సంవత్సరాలుగా భారత్ మార్కెట్లో ఉంది.. అయితే గత సంవత్సరం హ్యుందాయ్ కంపెనీ టక్సన్ కు కొత్తగా ఫేస్ లిఫ్ట్ ను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ కార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
2020లో అంటే ఈ ఏడాది ఈ కారును లాంచ్ చెయ్యనున్నారు. అందుకే ఇప్పటికే ఈ కారుకు సంబంధించి టెక్స్ట్ లు జరిగాయి.
2020 హ్యుందాయ్ టక్సన్ ఫీచర్స్ లో లీడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్ఎల్లను బంపర్‌లో మరియు ఫాగ్లైట్ల చుట్టూ ఉంటాయి.
ఈ వాహనంలో ముందు, వెనుక భాగంలో పునఃరూపకల్పన చేయబడిన బంపర్లు ఉంటాయి.
2020 హ్యుందాయ్ టక్సన్ యొక్క సైడ్ ప్రొఫైల్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. అయితే ఆ మార్పులలో కొత్త మెషిన్-కట్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
ఫ్యూయల్ పిల్లర్ క్యాప్, టెయిల్-గేట్ డిజైన్ నవీకరణలు కూడా చేయబడ్డాయి.
కాగా ఈ హ్యుందాయ్ 2020 ఫేస్‌లిఫ్టెడ్ బిఎస్ 6 హ్యుందాయ్ టక్సన్ బేస్ వేరియంట్ ధర రూ. 20 లక్షలు ఉండగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 30 లక్షలు నిర్ణయించాలని భావిస్తున్నారు.