బంపర్ ఆఫర్.. ఆ కారుపై 3 లక్షలు సూపర్ క్యాష్ డిస్కౌంట్ !!

frame బంపర్ ఆఫర్.. ఆ కారుపై 3 లక్షలు సూపర్ క్యాష్ డిస్కౌంట్ !!

Durga Writes

బంపర్ ఆఫర్.. కొత్తగా కారు కొనాలనుకునే వారికీ ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదిరిపోయే డిస్కౌంట్లను ఆఫర్ ను ఓ కారు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంత ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారా ? అంత ఇంత కాదు.. దాదాపు 3 లక్షల రూపాయిల వరుకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా ఈ ఆఫర్ ని అందిస్తోంది. 

 

అయితే ఈ ఆఫర్ మరో 5 రోజులు మాత్రమే ఉంటుంది. అది కూడా నవంబర్ 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే మూడు కార్ల అదిరే ఆఫర్లను ప్రకటించారు. ఆ కార్లు ఏంటి అంటే.. రెనో డస్టర్, రెనో క్విడ్, రెనో క్యాప్చర్ వంటి మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రెనో డస్టర్ మోడల్‌పై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. అంతేకాదు రూ.10,000 లాయల్టీ బోనస్ లేదా రూ.20,000 ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

 

కాగా రెనో క్విడ్ మోడల్‌పై కూడా రూ.50,000 వరకు ప్రయోజనం పొందొచ్చు. 4 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ వంటి బెనిఫిట్స్ కూడా ఈ ఆఫర్ లో ఉన్నాయి. అంతేకాదు కంపెనీకి చెందిన రెనో క్యాప్చర్ కారుపై అదిరిపోయే డిస్కౌంట్ ఇస్తుంది. ఏకంగా రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే రూ.5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 

 

అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది. రెనో క్యాప్చర్ కారు ధర రూ.9.49 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. కాగా గరిష్ట ధర రూ.11.99 లక్షలుగా ఉంది. పెట్రోల్ వేరియంట్‌కు ఇది వర్తించగా డీజిల్ వేరియంట్ ధర రూ.10.49 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు గరిష్ట ధర రూ.12.99 లక్షలుగా ఉంది. అయితే ఈ రెనో క్యాప్చర్ కారుకు రూ.3 లక్షల డిస్కౌంట్‌ అంది ఆకర్షణీయంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్తగా కారు కొనాలి అనుకునే వారు వెంటనే ఈ కారును కోనేయండి.. ఈ 3 లక్షల ఆఫర్ కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: