ఎమ్మార్వో ఆఫీస్ లోనే ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతులు...

praveen

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. కానీ అధికారుల అలసత్వంతో భూ ప్రక్షాళన లో చేపట్టిన రికార్డులన్నీ తప్పులతడకగా మారుతున్నాయి. దీంతో రైతులు అవస్థలు అన్నీ ఇన్నీ కావు. రైతుల రోజువారి పని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి  భూప్రక్షాళనలో  దొర్లిన తప్పులను సరి చేయించడం అయిపొయింది . కానీ రోజులు గడుస్తున్నాయి తప్ప తమ పని మాత్రం కావడం లేదు. దీంతో ఆవేదనకు గురైన రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నాడు . ఇలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా లో బెజ్జురు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఇద్దరు రైతులు తాహిసిల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్న... అధికారులకు లంచాలు మూట  చెప్పిన తమ సమస్యలు మాత్రం పరిష్కరించలేదు అధికారులు. ఆవేదన చెందిన ఆ రైతు తండ్రి కొడుకులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందే  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

 

 

 

తండ్రి పేరు మీద ఉన్న ఆస్తిని  రెండు భాగాలుగా పంచుకుండా  మొత్తం తన వదిన పేరు పట్టా చేసారని...దీంతో తనకు అన్యాయం జరిగిందని  రైతు అధికారులకు మొరపెట్టుకున్నాడు. తన వాటా తనకు ఇవ్వకుండా అన్న  భార్య  అడ్డు పడుతుందని ... తనకు న్యాయం చేయాలని అధికారులకు విన్నవించారు. అయితే అధికారుల అలసత్వం కారణంగా రోజులు గడుస్తున్న ఆ రైతు పని మాత్రం కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రైతు ఎమ్మార్వో కార్యాలయంలో తండ్రి మూఖ్య  తో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు వారిద్దరిని  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఇది ఒక ఆసిఫాబాద్ జిల్లా లోనే కాదు. ప్రతి జిల్లాలో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. భూ ప్రక్షాళన లో దొర్లిన తప్పుల కారణంగా వాటిని సరి చేసుకోవడానికి తాసిల్దార్ కార్యాలయంలో చుట్టూ తిరిగిన పనులు మాత్రం జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: