యమహా ఆర్15 ధర పెరిగింది..!

shami
యమహా నుండి రాబోతున్న సరికొత్త ఆర్15 వి3.0 బైక్ ధర రివీల్ చేసింది యమహా బైక్. 2018 మొదట్లో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పో లో ఈ బైక్ ప్రదర్శించబడింది. ఇక దీని ధర 1.25 లక్షలుగా నిర్ణయించడమైనది. 150సిసి ఫుల్లీ ఫెయిర్ మోటార్ ఆర్ 15 గా ఈ బైక్ వస్తుంది.


ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల్లో యమహా అర్15 చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ ఆర్15 వి3.0 తో పాటుగా ఆర్ 15 ఎస్ వేరియెంట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆర్ 15ఎస్ ధర కూడా పెరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఆర్15 వి3.0 వర్షన్ 19.5 బి.హెచ్.పి పవర్, 15 ఎన్.ఎం టార్క్ తో ఈ మోడల్ వస్తుంది.


కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న ఈ బైక్ యమహా ప్రేమికులకు నచ్చేలా డిజైన్ చేయబడింది. ధర కాస్త పెరిగింది అంతే తప్ప టెక్నికల్ గా ఎంతో అడ్వాన్స్ గా ఈ బైక్ వస్తుంది. త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ ఆర్ 15 వి3.0 అడ్వాన్స్ బుకిగ్ త్వరలో ఓపెన్ చేస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: