బన్నీకి కూతురి విషయంలో టెన్షన్ స్టార్ట్ అయిందిగా?

VAMSI
బయట ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా తన చిన్నారి పిల్లలకు మాత్రం ఎపుడు ఆటబొమ్మలే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చూస్తే ఇది అక్షర సత్యం అని అనిపిస్తుంది. బన్నీ తన పిల్లలతో కలసి చేసే అల్లరిని ఆ స్వీట్ మెమోరీస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి సంతోషాన్ని పంచుతుంటారు అల్లు వారి ఇంటి కోడలు స్నేహ రెడ్డి. ఆ ఫోటో లు, వీడియోలు చూస్తుంటే బన్నీ తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ముఖ్యంగా తన పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటారు అన్నది అర్థమౌతుంది. బన్నీకి పిల్లలంటే పంచ ప్రాణాలు.. ముఖ్యంగా తన గారాల పట్టి , చిట్టి తల్లి అర్హ అంటే ప్రాణం. ఎపుడు టైం దొరికినా పిల్లలతో బిజీ అయిపోతారు బన్నీ.

వారిని లాంగ్ డ్రైవ్ లకు తీసుకెళ్లడం అంటే బన్నీకి చాలా ఇష్టం. అలాగే తన కూతురికి చిన్నప్పటి నుండే తన మాట వినాలని ట్రై చేస్తూ సరదాగా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక వీడియోలో అర్హని ఉద్దేశించి 'నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని బన్నీ అడుగుతుంటే, లేదు నేను చేసుకోను అంటూ సరదాగా అంటుంది అర్హ అయినా బన్నీ నాన్న మాట వినాలి అంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఆ వీడియో చాలా క్యూట్ గా ఉంటుంది. అలా సమయం దొరికినప్పుడల్లా నాన్న ఏమని చెప్పినా వినాలి తల్లి, నాన్న చెప్తే చేయాలి అంటూ కూతురికి చెప్తున్నారు బన్నీ.

మాములుగా ఏ తండ్రికైనా తన కూతురు తన మాట తుచ తప్పకుండా పాటిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు, అదో తెలియని ప్రౌడ్ ఫీలింగ్... బహుశా బన్నీ కూడా అలా తన చిట్టి కూతురు కూడా అలా వినాలని అనుకుంటున్నారేమో. అయితే పిల్లలకు  స్వేచ్ఛను కూడా ఇవ్వాలని భావించే అభిప్రాయం ఉన్న వ్యక్తి బన్నీ. ఇక తన కూతురు హీరోయిన్ అయితే చూడాలని ఉందని బన్నీ అంటుంటారు కొందరు సన్నిహితులు అంటుంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: