Jeep Avenger: సూపర్ రేంజ్.. సూపర్ ఎలక్ట్రిక్ కార్?

Purushottham Vinay
ఇక అమెరికన్ కార్ల తయారీ కంపెనీ అయిన జీప్ తాజాగా మరో కొత్త కారును మార్కెట్‌లోకి తీసుకురావడం జరిగింది.ఈ కంపెనీ ఇప్పుడు తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది.ఈ కంపెనీ పేరు అవెంజర్. కంపెనీ తొలిగా ఈ కారును 2022 పారిస్ మోటార్ షోలో పెర్ఫార్మ్ చేసింది. ఈ జీప్ అవెంజర్ కారు కేవలం ఒక్క బ్యాటరీ ఆప్షన్‌తోనే తన కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. అయితే నాలుగు వేరియంట్ల రూపంలో మాత్రం ఇది లభిస్తుంది. ఫస్ట్ ఎడిషన్, లాంగిట్యూడ్, అల్టిట్యూడ్ ఇంకా అలాగే సమిట్  లో రానుంది.ఈ జీప్ అవెంజర్ మోడల్ ప్రస్తుత జీప్ మోడళ్లను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో రాడార్ అనేది ఉంటుంది. అడాస్ టెక్నాలజీ కోసం వీటిని ఫిక్స్ చేశారు. ఇంకా అలాగే దీనికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇంకా లార్జ్ ఎయిర్ డ్రమ్, ఫామ్ ల్యాంప్స్, లయర్ బంపర్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఇంకా సెవెన్ స్లేట్ గ్రిల్ వంటి సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ కార్ లో 16 ఇంచుల డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి.


ఇక వెనుక భాగంలో ఈ కారుకు ఎక్స్‌ షేప్ ఎల్ఈడీ లైట్స్, రియర్ వైపర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటినా, పానోరమిక్ సర్ రూఫ్ ఇంకా అలాగే రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. ఈ కారు పొడవు మొత్తం 4080 ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 ఎంఎం. ఈ కార్ క్యాబిన్ విషయానికి వస్తే.. ఇందులో 10.2 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అలాగే వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా అలాగే అడ్జస్టబుల్ సీట్స్ విత్ మసాజ్ ఫంక్షన్, మల్టీ కలర్డ్ యాంబియెంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, లెవెల్ 2 అడాస్ ఇంకా 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.జీప్ అవెంజర్ కారు బ్రాండ్ న్యూ ఇసీఎంపీ2 మోడ్యులర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ తో డిజైన్ చేయబడింది. ఇందులో 54 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఈ కారు టార్క్ 260 ఎన్ఎం ఇంకా 154 బీహెచ్‌పీ. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్లు వెళ్తుంది. జీప్ కంపెనీ ఇందులో 100 కేడబ్ల్యూ చార్జర్ ఫీచర్ ని పొందుపరించింది. ఈ ఫీచర్ ద్వారా కారు బ్యాటరీ కేవలం 24 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం ఫుల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: