ఓలాకి ఎసరుపెడుతున్న టీవీఎస్?

Purushottham Vinay
ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో గట్టి పోటీ మొదలైంది.పెట్రోల్‌ ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో విద్యుత్‌ వాహనాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.అందువల్ల వీటికి డిమాండ్‌ బాగా పెరుగుతోంది. విక్రయాలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో ఓలా ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో ఉండగా.. ఈ కంపెనీకి టీవీఎస్‌ కంపెనీ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. ఇక విద్యుత్‌ వాహన విక్రయాల్లో గత సంవత్సరం 7,357 యూనిట్లతో హీరో ఎలక్ట్రిక్‌ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఒకినావా (5,900), యాంపియర్‌ (4300), ఓలా (3 వేలు) ఇంకా అలాగే టీవీఎస్‌ (2,238) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సంవత్సరంలో చాలా మార్పు వచ్చింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్‌ మార్కెట్‌ లీడర్‌గా అవతరించింది. మొత్తం 17,600 వాహనాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా 12,600 వాహన విక్రయాలతో టీవీఎస్‌ మోటార్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఏథర్‌ (10 వేలు), హీరో ఎలక్ట్రిక్‌ (5,900) ఇంకా అలాగే ఒకినావా (3,800) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇక ఫిబ్రవరి నెల గణాంకాల విషయానికి వస్తే.. టీవీఎస్‌ వాహన విక్రయాలు భారీగా వృద్ధి చెందడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక గత కొన్ని నెలలుగా 17వేల స్థాయిలో ఉన్న ఓలాకు టీవీఎస్‌ నుంచి చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం పుష్కలంగా వుంది. సంవత్సర కాలంగా టీవీఎస్‌ వేగంగా దూసుకోస్తోంది. కాగా.. ఓలా ఎలక్ట్రిక్‌ ప్రస్తుతం ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో ఇంకా అలాగే ఎస్‌1 ఎయిర్‌ పేరిట మూడు రకాల వాహనాలను వివిధ బ్యాటరీ వేరియంట్లలో విక్రయిస్తోంది. ఇంకా అలాగే టీవీఎస్‌ ఐక్యూబ్‌ పేరిట మూడు వేరియంట్లను విక్రయిస్తోంది. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లకి మంచి స్టైలిష్ స్కూటర్లుగా మార్కెట్లో డిమాండ్ వుంది. ఇప్పుడు టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా స్టైలిష్ లుక్స్ తో స్కూటర్లని రిలీజ్ చేస్తూ ఓలాకి గట్టి పోటీని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: