కొత్త మైలురాయిని సాధించిన ఎంజి హెక్టర్?

Purushottham Vinay
చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ ఎంజి మోటార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది ఈ కంపెనీ. ఇక ఇప్పుడు తన 'హెక్టర్' కార్ ఉత్పత్తిలో కొత్త మైలురాయిని సాధించింది.కంపెనీ ఈమధ్యనే 1,00,000 వ యూనిట్ ను విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.MG మోటార్స్ కంపెనీ ఇండియాలోని గుజరాత్‌లో తన హలోల్‌లోని ఫెసిలిటీలో హెక్టర్  100,000 వ యూనిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన గొప్ప రికార్డ్ అనే చెప్పాలి. 2019 లో ప్రారంభమైన హెక్టర్  ఉత్పత్తి 2022 డిసెంబర్ నాటికి 1 లక్ష యూనిట్లు అయ్యింది.ఈ కార్ 2019 జూన్ నుంచి అమ్మకానికి వచ్చింది.ఎంజి హెక్టర్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చాక ఈ కార్ కంపెనీ  మొదటి మోడల్.. ఇక ఈ హెక్టర్ 1,00,000 వ యూనిట్ గ్లేజ్ రెడ్‌ కలర్ లో ఉంది. ప్రస్తుతం కంపెనీ హెక్టర్, హెక్టర్ ప్లస్, ఎంజి గ్లోస్టర్, ఎంజి ZS EV ఇంకా అలాగే ఆస్టర్ వంటి వాటిని ఇండియన్ మార్కెట్లో అమ్ముతుంది.


అలాగే ఈ కంపెనీ త్వరలో తన హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది.  ఈ వెర్షన్ ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే కూడా లేటెస్ట్ కాస్మెటిక్ డిజైన్ ఇంకా ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కారులో 14-ఇంచెస్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. అంతే కాకుండా ఇందులో అప్‌డేట్ చేయబడిన AC వెంట్స్ డిజైన్, ఆటోమేటిక్ వెర్షన్ కోసం కొత్త గేర్ లివర్ ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంటాయి.అలాగే ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) కాకుండా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇంకా అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో అందుబాటులో ఉంటాయి.MG హెక్టర్ 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంకా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది.6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ DCT ఆటోమేటిక్ ఇంకా CVT ఆటోమేటిక్‌తో అందుబాటులో ఉంటాయి. అందువల్ల పనితీరు బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: