టొయోటా నుంచి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్.. దేశంలోనే ఫస్ట్?

Purushottham Vinay
టొయోటా కంపెనీ ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సహకారంతో పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రవేశపెట్టబడిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల కోసం టొయోటా తమ ఫస్ట్ కరోలా ఆల్టిస్ హైబ్రిడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ప్రారంభించింది.టొయోటా కరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం ఫ్లెక్స్ ఫ్యూయెల్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. పేరుకి తగినట్లు ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ కలిగిన కార్లలో ఇంధన ఆప్షన్లు కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. సాధారణ పెట్రోల్ వాహనాలు కేవలం పెట్రోల్ ఇంధనంతో మాత్రమే నడుస్తాయి. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు 83 శాతం వరకు పెట్రోల్ ఇంకా 17 శాతం ఇథనాల్ కలయికతో కూడిన ఇంధనంతో పనిచేస్తాయి. ప్రస్తుతం, మనం వినియోగిస్తున్న పెట్రోల్‌లో ఇథనాల్ కలిసి ఉన్నప్పటికీ, దాని శాతం చాలా తక్కువగా ఉంటుంది.రానున్న సంవత్సరాలలో భారత ప్రభుత్వం పెట్రోల్ ఇంధనంలో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి పెంచాలని చూస్తోంది.


ఇదే గనుక జరిగితే మనదేశంలోని ఆటోమొబైల్ సంస్థలు తప్పనిసరిగా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్లను ఉపయోగించాల్సి ఉంటుంది.సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనలతో పోలిస్తే, ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్‌తో నడిచే కార్లు చాలా సమర్థవంతమైనవిగా చెబుతారు. పూర్తి పెట్రోల్ వాహనాలతో పోలిస్తే, ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ కలిగిన వాహనాల యాక్సలరేషన్ ఇంకా పెర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే, పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల మైలేజీ తగ్గుతుంది.ఫ్లెక్స్ ఫ్యూయెల్ ప్రాజెక్టులో భాగంగా టొయోటా ఈ కారును విదేశాల నుండి భారతదేశానికి దిగుమతి చేసుకుంది. అందుకే, ఇది అమెరికన్ మార్కెట్లలో కనిపించే కార్ల మాదిరిగా ఎడమ చేతి వైపు స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది. సమాచారం ప్రకారం, ఈ కారును ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్లు సర్వసాధారణంగా ఉపయోగించబడే బ్రెజిల్ నుండి తీసుకోబడింది. ఈ తరం కరోలా హైబ్రిడ్ రెండు సంవత్సరాలుగా ఫారెన్ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: