'ఇడియట్' హీరోయిన్ కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు ?

VAMSI
సినిమా ప్రపంచంలో ఎపుడు ఏ అద్భుతం జరుగుతుంది అన్నది ఎవరు ఊహించలేము. ఎవరిని అదృష్టం ఏ స్థాయిలో కూర్చోపెడుతుంది అన్నది కూడా సంశయమే. అయితే నటీనటులకు ఖాతాలో ఒక్క సరైన హిట్ పడిందంటే ఆ తరవాత ఆ నటి ఆచి తూచి అడుగేస్తే చాలు ఇక తమ కెరియర్ గాడిలో పడ్డట్టే... అలా కాకుండా అవేశం కి పోయి ఏమాత్రం కొంచం పొరపాటు చేసినా ఇక అసలు కెరియర్ అనేది ఉండదు. ఇలా చాలా మంది నటులు తాము చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన ఫేడ్ ఔట్ అయ్యి తట్ట బుట్ట సర్దుకుని ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయారు. పొరపాట్లు అంటే ఇక్కడ మరేవో కాదు వచ్చిన ఫేం ని నిలబెట్టే కథలను ఎంచుకోవడం, హీరోయిన్ అయితే సీనియర్ హీరోలతో సినిమాలు చేయకుండా యంగ్ స్టార్ హీరోల్ని ఎంచుకోవడం వంటివి చేయడం కీలకం.
అలా కాకుండా హిట్ పడి అందరి దృష్టిలో పడగానే వచ్చిన ప్రతి ఛాన్స్ ని ముందు వెనకా ఆలోచించకుండా ఒకే చేసేస్తే క్లిక్ అయితే పర్వాలేదు. కానీ రివర్స్ అయితే మాత్రం కెరియర్ ఇక అటకెక్కినట్లే. ఇదే తరహాలో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ చక్రం తిప్పాల్సిన రవితేజ హీరోయిన్ అర్ధాంతరంగా కనుమరుగై పోయింది. ఇంతకీ ఆమెవరో కాదు చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటూ ఇడియట్ సినిమాలో రవి తేజ  హీరోయిన్ రక్షిత. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రక్షిత కూడా తన అంద చందాలతో కుర్ర కారు అదుపుతప్పేలా చేసింది. అంతా కూడా ఇక రక్షిత టాప్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అనుకున్నారు. కానీ...రక్షిత మాత్రం కొన్ని చిత్రాలకే ఫేడ్ ఔట్ అయిపోయింది.
ఇందుకు ఇవే కారణాలు అని గట్టిగా వినిపిస్తోంది. ఇడియట్ మూవీ తరవాత.. శివమణి, పెళ్ళాం ఊరెళితే, నిజం వంటి సినిమాలు చేసింది. కానీ నిజం చిత్రం ఈమెకి సక్సెస్ అందించక కాస్త డౌన్ అయ్యింది. అలాంటి టైం లో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది పోయి... ఆంధ్రావాలా, అందరివాడు సినిమాల్లో పేలవమైన పాత్రలకు ఒప్పుకుంది. ఆ సినిమాల్లో పాత్రలు ఆమెకి ఎంతమాత్రం పేరు తేలేదు. దాంతో వరుసగా చిత్రాలు బెడిసికొట్టడంతో కెరియర్ చిక్కుల్లో పడింది.  ఒకవేళ కరెక్ట్ డెసిషన్ తీసుకుని వుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ఖచ్చితంగా రక్షిత పేరు ఉండేది అని అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. ఆ  తరువాత రక్షిత ప్రేమ్ మాస్టర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే  అయితే ఈమె ప్రస్తుతం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అన్నది బహుశా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: