'జాన్వీ కపూర్' కు ఎలాంటి భర్త కావాలో తెలుసా?
అందుకే తన తర్వాత సినిమా గుడ్ లక్ జెర్రీ పైనే తన ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన కొలమావు కోకిల కు రీమేక్ అని తెలిసిందే . దీనికి సిద్దార్ధ్ సేన్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తాను తనకు కాబోయే భర్త గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ నాకు కాబోయే భర్త మంచి ప్రతిభావంతుడు అయి ఉండాలి.. సెన్స్ అఫ్ హ్యూమర్ ఉండాలి... లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. రోజూ నాలో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండాలి, రోజూ అతని నుండి నేను నేర్చుకునే విషయం ఒకటి ఉండాలి. నేను సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అంటూ తన కలల రాకుమారుడి గురించి చెప్పుకొచ్చింది. మరి ఝాన్వి కపూర్ తన కాబోయే భర్త కోసం కన్న కలలు అన్నీ నిజ అవుతాయా ? భవిష్యత్తులో ఎలాంటి భర్త రానున్నాడో చూడాలి.