మోహన్ లాల్ హీరోయిన్ 'బాత్ రూమ్ కడగడానికి' సిద్దమట ?

VAMSI
ఆమె ఒక సీనియర్ స్టార్ నటి కూతురు. అలా స్టార్ కిడ్ గా ఇండస్ట్రీ లోకి ఆడుగు పెట్టిన ఆమె 200 చిత్రాల్లో పైగా నటించారు. అలాంటి ఆమె ఇపుడు ఏమి చేస్తుంటారు అంటే అంతా ఏమనుకుంటాం..!! ఆమె ఇపుడు గొప్ప లగ్జరీ లైఫ్ లో చాలా సంతోషంగా ఉంటారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ విషయం వింటే షాక్ అవుతారు. ఆమె ప్రస్తుతం అవకాశాలు లేక సేల్స్ గర్ల్ గా మారారు. రోడ్డుపై సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు అంటే నమ్మగలమా కానీ అదే నిజం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో ప్రముఖ పాత్రలలో అలరించిన నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య కూడా ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే. మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత క్రేజ్ తగ్గడం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.
అలా ఒకప్పుడు ఆమె స్టార్ స్టేటస్ ఉన్న నటి..  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో  దాదాపు
150 చిత్రాల్లో పైగా నటించింది.. మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్ హీరో సరసన హీరోయిన్‌గా కూడా అవకాశాలు అందుకుని పాపులర్ అయ్యింది. అయితే ఆ తరవాత క్రేజ్ తగ్గడంతో చిన్న చిన్న పాత్రలు కూడా పోషించింది. ఇంత బ్యాక్ గ్రౌండ్  ఉన్న ఆ నటి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేకపోవడం తో పొట్ట నింపుకోవడం కోసం  వీదుల్లో ఇంటింటికీ తిరిగి సబ్బులు అమ్ముతోంది. అలా వచ్చిన డబ్బులతో బ్రతుకుతున్నారు ఐశ్వర్య. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన  ఈమె పలు సంచలన విషయాలు వెల్లడించారు. తనకి ఇపుడు ఇల్లు గడవడం కష్టంగా ఉందని, ఇపుడు ఎవరైనా తమ ఆఫీస్ లో పని ఇస్తానంటే తప్పకుండా చేస్తానని చెప్పింది.
అలాగే మంచి జీతం ఇస్తే పాచి పనులు మరియు బాత్ రూమ్ లు కడగడానికి కూడా తనకు అభ్యంతరం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకి అప్పుడే ఏమీ లేవని అయితే కుటుంబం కోసమే తన సంపాదించిందంతా ఖర్చు చేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దగ్గర ఏమి మిగలలేదు అని...అందుకే పొట్ట కోటి కోసం ఇలా సబ్బులు అమ్ముతున్నానని అయిన రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం తినగల పరిస్థితిలో ఉన్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటి ఐశ్వర్య భాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: