'లేడీ ఓరియెంటెడ్' చిత్రాలతో రానున్న కాజల్ అగర్వాల్ ?

VAMSI
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇపుడు తన బేబీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏడాదిన్నర క్రితమే గౌతం కిచ్లు ని ప్రేమ వివాహం చేసుకున్న ఈ అందాల తార అపుడే ఓ బిడ్డకు జన్మ ను కూడా ఇచ్చి తల్లిగా మారి తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంది. అయితే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతున్నా ఈ భామ ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది. కెరియర్ ఫామ్ లో వుండగానే పెళ్లి చేసుకుని కెమెరాకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్ళీ ఈ భామ ఇపుడు సినిమాల్లోకి రావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాజల్ ను బాగా మిస్స్ అవుతున్న ఆమె ఫ్యాన్స్ తమ అభిమాన తార తిరిగి ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్న నేపథ్యం లో కాజల్ అభిమానుల కోరిక మేరకు తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అందుకోసం భర్త కిచ్లు ను కూడా ఇప్పటికే ఒప్పించేసిందట చందమామ. అయితే ఈసారి తన సినిమాల ఎంపిక చాలా విభిన్నంగా ఉండేలా చూసుకోనుందట కాజల్. గతంలో ఎక్కువగా గ్లామర్ రోల్స్ కు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సుందరి ఈసారి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ వంటివి ట్రై చెయ్యాలనే అనుకుంటున్నారట. ఆచార్య సినిమాలో నటించింది కానీ ... లాస్ట్ లో ఆమె సీన్లన్నీ ఎడిటింగ్ లో తీసేసారు. ఇక ఆల్రెడీ ఒప్పుకున్న ఇండియన్ 2 సినిమా  ఇప్పట్లో మళ్ళీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఫ్రెష్ గా ఫ్రెష్ లుక్ తో మన ముందుకు రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
అయితే డెలివరీ అయ్యాక ప్రస్తుతం కొంచం రెస్ట్ లో ఉన్న కాజల్ , ఓ వైపు విశ్రాంతి తీసుకుంటూనే స్టోరీస్ వింటున్నట్లు తెలుస్తోంది. వాటిల్లో కనుక ఏ కథ అయినా నచ్చితే ఒకే చెప్పాలని అనుకుంటున్నారట. ఇప్పటికే రెండు స్టోరీస్ ను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. కాగా వాటిల్లో ఒకదాన్ని ఫైనల్ చేయాలనే ఉన్నట్లు ఉంది. ఏదేమైనా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మళ్ళీ సినిమాలతో బిజీ అయి స్క్రీన్ పై సందడి చేయాలని అంతా కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: