కోహ్లీ భార్యకు నిద్ర పోవడానికి టైం లేదట ?
తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించడం లోనూ శబాష్ అనిపించుకుంటున్న అనుష్క తనకి నిద్రపోవడానికి కేవలం రెండు గంటలే దొరికాయి అంటోంది. ఇటీవలే ఓటీటీలో కూడా అడుగు పెట్టిన ఈ అందాల తార ఇక్కడ కూడా ది బెస్ట్ అనిపించుకోవాలని చాలా కష్టపడుతున్నారు. తన ఓ టి టి వేదికకు సంబందించిన విషయం అయి పలువురు ప్రేమికులను కలుస్తూ కొత్త కొత్త రూపకల్పనలు చేస్తున్నారు. అలాగే 'ఏ మదర్ ఏజ్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'చక్ దా ఎక్స్ ప్రెస్' లోనూ హీరోయిన్ గా చేస్తోంది. మరో వైపు 'ఖాలా' అనే మరో వెబ్ సిరీస్ బాధ్యతలు ఇంకోవైపు కుటుంబం ఇలా చాలా చాలా బిజీ షెడ్యూల్ తనది.
కాగా ఒక ఫోటో ని షేర్ చేస్తూ కేవలం రెండు గంటలే నిద్రపోయాను అంటూ ఆ ఫోటోని ఉద్దేశించి రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోలో అనుష్క చాలా రెస్ట్ లెస్ గా కనిపిస్తున్నప్పటికీ తన ఆత్మ విశ్వాసం మాత్రం మెండుగా కనపడుతోంది. పనిపై తనకున్న డెడికేషన్ ని కనబరుస్తోంది. అయితే ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు మీరు చాలా గ్రేట్ మ్యామ్ అంటూ పొగిడేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ ది గ్రేట్ ఉమెన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.