అరియనా జీవితంలో ఈ విషాదం గురించి మీకు తెలుసా?

VAMSI
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోతో పాపులారిటీ పెంచుకున్న సెలబ్రిటీలలో అరియనా గ్లోరి కూడా ఒకరు. కరెంట్ తీగలాంటి ఈ బామ తన చలాకీతనంతో తెలుగు ఆడియన్స్ కి బిగ్ బాస్ షోతో బాగా దగ్గరయింది. హౌజ్ నుండి బయటకొచ్చాక సోషల్ మీడియాలో అభిమానులతో ఎపుడు టచ్ లో ఉంటోంది. మధ్య మధ్యలో టీవి షోలు చేస్తూ అందిన అవకాశాల్ని సద్వినియోగ పరచుకుంటోంది. అంతే కాకుండా ఆర్జీవీతో జరిగిన ఇంటర్వూ అరియనాకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. జిమ్ లో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన అరియానా కొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం మళ్ళీ ఓటిటి లో ప్రసా రమౌతున్న బిగ్ బాస్ షో కి కంటెస్టెంట్ గా వెళ్లి ప్రేక్షకులను తన పర్ఫామెన్స్ తో అలరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ షోలో ఉన్న అరియాన తనకు సంబందించిన ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. తన ప్రేమ విషయాన్ని బయటపెడుతూ బోరున విలపించింది. తనను తన బావ మోసం చేశాడంటూ కంట తడి పెట్టుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు నుండే తన బావను ఇష్టపడటం మొదలు పెట్టిందట. అపుడే అతడితో ప్రేమలో పడిందట. అలా ఆ ప్రేమ వారితో పాటు పెరిగి పెద్దది అయ్యిందని..తన బావ  జాబ్ రావడం తో హైదరాబాద్ కు వెళ్లారని. ఆ తరవాత తను కూడా  భావ దగ్గరకి వెళ్లిపోయింది.
అలా మూడేళ్ల పాటు కలిసే ఉన్నామని ఆ సమయంలో తనతో చాలా ప్రేమగా ఉండేవాడని, అయితే కొన్నాళ్ళకి మా బావకి నేను బోర్ కొట్టేశాను అని లేట్ గా అర్దం అయ్యింది. ఒకసారి తన బావని చూడకూడని స్థితిలో  చూశానని అక్కడితో బావపై మనసు విరిగిపోయింది అని చెప్పుకొచ్చింది అరియనా. అయితే మళ్ళీ మాయమాటలు చెప్పి తనను నమ్మించాడని, అలా మళ్ళీ రెండేళ్లు గడిచాక అరియనా ఆర్ జే గా జాబ్ చేస్తున్న సమయంలో అనుమానంతో బాధపెట్టాడు దాంతో బ్రేకప్ చెప్పేశాను. ఆ తరవాత బావను మర్చిపోలేక ఒకసారి  మంచి గిఫ్ట్ తీసుకుని తన దగ్గరకు వెళితే తనని కాదు పొమ్మన్నాడని అక్కడితో నా మనసు పూర్తిగా విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇపుడు ఒకవేళ మళ్ళీ బావ తన కోసం వచ్చినా తనకు అక్కర్లేదని కరాఖండిగా చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: