"రంగమ్మత్త" రాంగ్ స్టెప్ వేస్తోందా... కెరీర్ ఖతం ?

VAMSI
బుల్లితెరపై నవ్వుల పూలు పోయిస్తున్న ఎవర్ గ్రీన్ షో జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమైన అనసూయ అందంతో, వాక్చాతుర్యంతో, అభినయంతో మంచి మార్కులు సంపాదించుకుంది. నిజానికి పెళ్ళయ్యాక ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది అను చాలా ఈజీగా ఆ ఛాలెంజ్ ను బ్రేక్ చేసింది, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటు బుల్లితెర, అటు వెండి తెర రెండింటిలోనూ హవా చాటుతోంది. రంగమ్మత్త పాత్రతో బాగా పాపులర్ అయిన ఈ అందాల నటి ఆ తరువాత వరుసగా పెద్ద ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో మరో వైవిధ్యభరితమైన పాత్రతో ప్రేక్షకులను అలరించింది.
ఇలా కెరియర్ ఫుల్ ఫామ్ లో ఉన్న అనుకు కూడా ఇపుడు అవకాశాలు కరువయ్యాయని కారణాలు ఇవేనని కొన్ని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఏమిటాకారణం అంటే... ఈ మధ్య అనసూయకు కొన్ని పెద్ద సినిమాల్లో వదిన, అక్క వంటి పాత్రలకు గానూ ఛాన్స్ లు వచ్చాయంట, అయితే తన పాత్ర కి డెప్త్ లేకపోతే చేయలేనని వాటిని రిజెక్ట్ చేశారట అనసూయ. దాంతో పలు అవకాశాలను చేజార్చుకున్న అనుకి ఇపుడు డైరెక్టర్స్ అవకాశం ఇవ్వాలి అంటే వద్దంటారేమో  అని ముందుగానే అప్రోచ్ అవ్వడం వదిలేసి వేరే యాక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారట.
అలా తనకు దక్కాల్సిన అవకాశాలను చేతులారా వదులుకుంటున్నారట మన హాట్ యాంకర్ అను. ఐంతే ఇందుకు భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా కొంత కాలం వరకు మాత్రమే ఆ ఫేమ్ ఉంటుంది. అది ఉన్ననప్పుడు మాత్రమే వచ్చిన పాత్రలను చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. అలా కాకుండా నాకు నచ్చిన పాత్ర అయితేనే చేస్తాను అంటూ డిమాండ్ చేస్తే ఇండస్ట్రీలో క్నుమరుగైపోవడం పక్కా. మరి ఇది ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: