హిమజ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అదే అంటే నమ్ముతారా?

VAMSI
'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన హిమజ ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి అభిమానుల సంఖ్యను పెంచుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగు పెట్టి తన పాపులారిటీ అలా పెంచేసుకున్న ఈ అందాల రాశి సోషల్ మీడియాలోనూ ఫుల్ రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఈమె పూర్తి పేరు హిమజ రెడ్డి. ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు, అతడు గూగుల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. హిమజకు చిన్నప్పటినుండే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ చదువు రీత్యా మొదట టీచర్ గా ఆ తర్వాత హెచ్ ఆర్ గా కూడా వర్క్ చేసింది. అయితే యాక్టింగ్ పై మక్కువ పెరగడంతో హైదరాబాద్ కు వచ్చి చాలా ఆఫీస్ ల చుట్టూ తిరిగారు.
అయితే మనము అడగగానే అవకాశాలు, సినిమాలలో వేషాలు రావడానికి మనకు ఏమీ మెగాస్టార్ అంత బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. ఇక లాభం లేదు అనుకుని 'భార్యామణి' అనే సీరియల్ లో 2013 లో ఒక చిన్న పాత్రకు అవకాశం రాగా  సరే అంది హిమజ. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. తన కెరీర్ ఊపందుకుంది మాత్రం 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం'   సీరియల్ తర్వాతనే అని చెప్పాలి. ఈ సీరియల్ లేకుంటే ఇప్పుడు హిమజ ఎక్కడో ఉండేది. అందుకే తన లైఫ్ లో ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అలా సినిమా అవకాశాలు హిమజ ను వెతుక్కుంటూ వచ్చాయి. శివం, జనతా గ్యారేజ్, శతమానం భవతి, నేను శైలజ, వినయ విధేయ రామ, చిత్ర లహరి ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

 
ఈమెకు it's himaja పేరుతో యు ట్యూబ్ ఛానల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఛానల్ కు 3.5 లక్షలకు పైగానే సబ్ స్క్రైబర్ లు ఉన్నారు. ఈమె సీరియల్స్ లో ఒక వారానికి ఒక లక్ష వరకు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలో నటిస్తూ కొంచెం బాగానే వెనకేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: