ఆ పాత్ర చేయలంటే భ‌యమేసింది: న‌భా న‌టేష‌

Dabbeda Mohan Babu
తెలుగు లో కొన్ని సినిమాలు చేసినా త‌న కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హిరోయిన్ న‌భా న‌టేష‌. న‌న్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించింది. త‌న మొద‌టి సినిమాతో నే హిట్ అందుకున్న ఈ బామ తెలుగులో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూ వ‌చ్చింది. అయితే ఇటివ‌ల న‌భా న‌టేష యంగ్ హిరో నితిన్‌తో మ్యాస్ట్రో సినిమాలో న‌టించింది. ఈ సినిమా బాలివుడ్ లో వ‌చ్చిన అందాధున్ అనే సినిమాకు రీమెక్ అని తెలిసిందే. హింది లో వ‌చ్చిన అందాధున్ సినిమాలో రాధికా ఆఫ్టే హిరోయిన్ గా నటించింది. ఈ రాధికా ఆఫ్టే పాత్ర‌ను తెలుగులో నభా న‌టేష న‌టిస్తుంది.

అయితే అందాధున్ లో రాధిక ఆఫ్టే అద్భ‌తంగా న‌టించింది. ఆ పాత్ర పోషిస్తున్న న‌భా న‌టేష రాధిక ఆఫ్టే లాగ న‌టించ‌గ‌ల‌నా అని చాలా భ‌య‌ప‌డింద‌టా ఈ అమ్మ‌డు. ఈ విష‌యం పై తాజా ఒక ఇంట‌ర్యూలో మాట్లాడింది. అందాధున్ రిమేక్‌లో అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోష ప‌డ్డాన‌ని అంది. అయితే రాధిక ఆఫ్టే పాత్ర చేయ‌డానికి చాలా కంగ‌రూ ప‌డ్డాన‌ని తెలిపింది. ఈ పాత్ర పూర్తిగా త‌న శైలీలో ఉండాల‌ని కొరుకుంద‌ట‌. దాని కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని అంది. కాగ మ్యాస్ట్రో సినిమా ఓటీటీ లో విడుద‌ల గురించి అడ‌గ‌గ.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేద‌ని అంది. థియేట‌ర్ ల‌ల్లో సినిమాలు విడుద‌ల చేస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయ‌ని అన్నారు. అందుకే అంద‌రికి ఎలాంటి ప్ర‌మాదం లేకుండా ఓటీటీ విడుద‌ల చేయ‌డం స‌రైనా నిర్ణ‌యమ‌ని అన్నారు.

కాగ మ్యాస్ట్రో సినిమాను గ‌తంలో థియేట‌ర్స్ లలో విడుదల చేయాల‌ని చిత్ర యూనిట్‌ నిర్ణ‌యించుకున్న.. క‌రోనా ప్ర‌భావంతో ఓటీటీల‌ల్లో విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్దం చేశారు. కాగ ఈ సినిమాను ఈ నెల సెప్టెంబ‌ర్ 17న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో విడుద‌ల కానుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: