త‌ట్టుకోలేక చ‌నిపోతా అనుకున్న: దీపికా ప‌దుకొన్‌

Dabbeda Mohan Babu
బాలివుడ్ ఇండ‌స్ట్రీ లో దీపికా ప‌దుకొన్ తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌స్తుతానికి మోస్టు స‌క్సెఫుల్ హిరోయిన్‌గా దీపికా ప‌దుకొన్ ఉన్నారు. బీ టౌన్ లో దాదాపు టాప్ హిరోలంద‌రితో దీపికా నటించింది. ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న హిరోయిన్ గ‌తంలో డిప్రెష‌న్ లోకి వెళ్లార‌ట. కొన్ని సంద‌ర్భంలో డిప్రెష‌న్ ను త‌ట్టుకోలేక చ‌నిపోదామ‌ని కూడా నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈ విష‌యాల‌న్నీ దీపికా ప‌దుకొనె నే చెప్పింది. బాలివుడ్ స్టార్ హిర్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌ వ్యాఖ్యాత గా వ్య‌వ‌హ‌రిస్తున్న కౌన్ బేగా క‌రోడ్ ప‌తి అనే రియాల్టీ షోలో కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కురాలు ఫ‌రాఖాన్‌తో క‌లిసి ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న డిప్రెష‌న్ రోజుల‌ను బిగ్‌బికి వివ‌రించింది.

2014 సంవత్స‌రం స‌మ‌యంలో కెరీర్ ప‌రంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని అంది. దీని వ‌ల్ల చాలా రోజుల పాటు డిప్రెష‌న్‌లో ఉన్న‌ను. నిద్ర అస‌లు ప‌ట్టేదే కాదు. ఎప్పుడు డ‌ల్ గా ఉండాదాన్ని. కార‌ణం తెలియ‌కుండానే  ఏడ్చేసాద‌న్ని అని చెప్పింది. ఇంటి నుంచి బ‌య‌ట కు వెళ్లేదాన్నే కాదు. ఒంట‌రి గానే ఉండేదాన్ని అని అంది. కొన్ని సార్లు చ‌నిపోదామ‌ని అనుకున్నాని తెలిపింది. త‌న మెంట‌ల్ కండిషన్ ను త‌న అమ్మ గ్ర‌హించి సైకియార్టిస్ట్ ద‌గ్గ‌రికి వెళుమ‌ని స‌ల‌హా ఇచ్చింద‌ని తెలిపింది. వైద్యుల స‌ల‌హతో కొన్నాళ్ల‌కు మామూలు మ‌నిషి గా మార‌న‌ని వివ‌రించింది. త‌న‌లా ఎవ‌రూ డిప్రెష‌న్ కు వెళ్ల కూడ‌ద‌ని స్వంత‌గా లివ్ ల‌వ్ లాఫ్ అనే ఫౌండేష‌న్ న‌డుపుతున్నాని తెలిపింది. తను స్థాపించిన లివ్ ల‌వ్ లాఫ్ అనే ఫౌండేష‌న్ ద్వారా చాలా మంది డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డుతున్నార‌ని సంతోషం వ్య‌క్తం చేసింది.

 డిప్రెష‌న్ నుంచి బ‌య‌టకు వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో సినిమాలు చేసాన‌ని అంది. మ‌ళ్లి అలాంటి రోజులు రావ‌ద్ద‌ని ఆ దెవున్ని ప్రార్థిస్తూ ఉంటానని అన్నారు. త‌న‌తో హ్యాపీ న్యూ ఇయ‌ర్ సినిమా చేసిన‌ప్పుడు దీపికా బాధ‌ప‌డిన‌ప్ప‌ట్టు ఎప్పుడు అనిపించ‌లేద‌ని డైర‌క్ట‌ర్ ఫ‌ర‌ఖాన్ అంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: