కంగ‌న‌కు షాక్.. ఆ కేసుల‌ను ర‌ద్దు చేయ‌లేం- బాంబే హైకోర్టు

Dabbeda Mohan Babu
వివాదాస్ప‌ద వ్యాక్య‌ల‌తో సోష‌ల్ మీడియాలో గ‌రం గ‌రం చేసే హిరోయిన్ కంగ‌నా ర‌నౌత్ కు ముంబై హై కోర్టు షాకిచ్చింది. హిరోయిన్‌ కంగ‌నా ర‌నౌత్ పై బాలీవుడ్ గేయ ర‌చ‌యిత జావేద అక్త‌ర్ వేసిన ప‌రువు న‌ష్టం కేసులో కంగ‌నా పిటిష‌న్ ల‌ను ముంబై హై కోర్టు కొట్టి వేసింది. గ‌త సంవ‌త్స‌రం బాలీవుడ్ గేయ ర‌చ‌యిత జావేద అక్త‌ర్ పై హిరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టీవీ ఇంట‌ర్య్వూ ల‌లో వివాద‌స్ప‌ద వ్యాక్య‌ల‌ను ప్ర‌యోగించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం విష‌యంలో కంగ‌నా ర‌నౌత్ జావేద్ అక్త‌ర్ పేరు తీసుకు వ‌చ్చింది. దీని పై జావేద్ అక్త‌ర్ స్పందించాడు. కంగ‌నా ర‌నౌత్ త‌న ఇమేజ్ ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హిరిస్తున్నాడ‌ని ఆగ్ర‌హించాడు. అనంత‌రం కంగ‌నా ర‌నౌత్ పై ప‌ర‌వు న‌ష్టం దావా కేసు వేశాడు.

ఈ కేసును విచారించాల‌ని గ‌త ఏడాది డిసెంబ‌ర్ లోనే హై కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. అలాగే  ఈ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రిలో కంగ‌నా ర‌నౌత్ కు సామ‌న్లు జారీ చేసింది. కాగ జావేద్ అక్త‌ర్ త‌న పై వేసిన ప‌రువు న‌ష్టం కేసును కొట్టివేయాల‌ని ముంబై హై కోర్టులో పిటిష‌న్ దాఖలు చేసింది. త‌మ త‌ర‌పు న్యాయ‌వాది రిజ్వాన్ సిద్ధ‌ఖీ ద్వారా ఈ పిటిష‌న్ ను వేసింది. త‌న పై ఉన్న ప‌రువు న‌ష్టం దావా కేసుల‌ను కొట్టి వేయాల‌ని ఆ పిటిష‌న్ లో ముంబై హై కోర్టు ను కోరింది. కాగ కంగ‌నా ర‌నౌత్ వేసిన పిటిష‌న్ ముంబై హై కోర్టు విచార‌ణ చేసింది. అయితే ఆ కేసుల‌ను ఇప్పుడు ర‌ద్దు చేయాల‌ని బాంబే హై కోర్టు తెల్చి చేప్పింది.
కాగ ప్ర‌స్తుతం కంగాన ర‌నౌత్ త‌లైవి సినిమాలో నిటించింది. ఈ సినిమా రేపు అన‌గా శుక్ర‌వారం తియెట‌ర్‌లో రిలీజ్ కానుంది. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త రాజ‌కీయ నాయ‌కురాలు జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా  ఈ త‌లైవి సినిమా విడుద‌ల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: