నాకు అలాంటి మొగుడే కావాలి: రాశిఖ‌న్నా

Dabbeda Mohan Babu
తాను పెళ్లి చుసుకునే వాడికి తాను కోరుకునే క్వాలిటిస్ త‌ప్ప‌కుండా ఉండాల‌ని స్టార్ హిరోయిన్ రాశిఖ‌న్నా అంటోంది. త‌మ జీవిత భాగ‌స్వామి ఎలా ఉండాలో కోరుకుంటారు. స్టార్ హిరోలు, హిరోయిన్ లు కూడా ఇలా త‌మ కాబోయే వారి గురించి కొన్ని అంచ‌నాల‌ను పెట్టుకుంటారు. అందులో భాగంగా త‌ను కూడా అలానే కొన్ని ప్ర‌త్యేక క్వాలిటీస్ ఉండాల‌ని చెబుతోంది. అలాంటి వాడిని తాను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించింది. రాశిఖ‌న్నా తెలుగులో ప‌రిమితంగా న‌టిస్తోంది. కానీ త‌మిళ్ లో స్టార్ హిరోయిన్ గా ఉంది. అక్క‌డ త‌న‌కు చెప్పుకోద‌గ్గ ఆవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతానికి ఈ అమ్మ‌డు స్టార్ హిరోల స‌ర‌స‌న న‌టించ‌డంలో బిజీగా ఉంది.

కాగ ఇటీవ‌ల ఒక ప్ర‌యివేట్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో త‌న‌కు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది. తాను దైవ భ‌క్తి ఉన్న వారుడు కోసం వెతుకుతున్నాన‌ని చెప్పుక‌చ్చింది. దేవుడి పై న‌మ్మ‌కం ఉన్న వాడు త‌న‌కు మొగుడిగా కావాల‌ని ప్ర‌క‌టించింది. త‌న‌కు పెద్ద అంద‌గాడు అవ‌స‌రం లేద‌ని చెప్పింది. అలాగే సిక్స్ ప్యాక్ వంటివి అవ‌స‌రం లేద‌ని అంది. కేవ‌లం ఆధ్య‌త్మ‌క చింత‌న ఉన్న వాడే కావాలంది. ఆధ్య‌త్మిక చింత‌న ఉన్న వారి మెద‌డు ప్ర‌శంతంగా ఉంటుంద‌ని, వారే త‌న‌ని అర్థం చేసుకుంటార‌ని తెలిపారు. దీంతో దైవ భ‌క్తి ఉన్న యువత రాశిఖ‌న్నా కు భ‌ర్త అయ్యే అర్హ‌త ఉంద‌ని నెట్టింట్లో అంటున్నారు. తమ ప్ర‌పొస‌ల్స్ ను సైతం ప‌రిశీలించ‌డం అని రాశిఖ‌న్నాను అడుగుతున్నారు.

ప్రస్తుతం రాశిఖ‌న్న త‌మిళంలో న‌టించిన అర‌ణ్య‌నై3, ద‌ర్బార్‌, తుగ్ల‌క్ వంటి సినిమాలు విడుదుల‌కు సిద్దంగా ఉన్నాయి. అలాగే తెలుగులో ప‌క్క క‌మ‌ర్షియ‌ల్‌, థాంక్యూ వంటి సినిమాల‌కు హిరోయిన్‌గా న‌టిస్తోంది. ఇంకా తెలుగులో బెంగాల్ టైగ‌ర్‌, సుప్రీం, జై ల‌వ‌కుశ‌, వెంకీ మామ‌, ప్ర‌తి రోజు పండ‌గే వంటి సినిమాలో హిరోయిన్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అంతే కాకుండా సింగ‌ర్ గానూ ప‌లు సినిమాల్లో చేసింది. జోరు, విల‌న్‌, జ‌వాన్ ప్ర‌తిరోజు పండ‌గే సినిమాల్లో పాట‌లు పాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: