పునీత్ హీరోగా చేసిన మొదటి సినిమా కు డైరెక్టర్ తెలుగు వాడే
అయితే పునీత్ రాజ్ కుమార్ ను శాండిల్ వుడ్ కు హీరో గా పరిచయం చేసింది మన తెలుగు డైరెక్టరే. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరో గా చేసిన మొదటి సినిమా కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా నే అప్పు. ఈ సినిమా తో కన్నడ ప్రజల్లో పునీత్ రాజ్ కుమార్ మంచి పేరు తెచ్చు కున్నారు. అలాగే ఈ సినిమా తో నే పునీత్ రాజ్ కుమార్ కు అప్పు అనే పేరు కూడా వచ్చింది. ఈ అప్పు అనే పేరు ను ఇప్పటికీ కూడా పునీత్ రాజ్ కుమార్ అభిమానులు పిలుస్తారు. ఈ సినిమా ఆ రోజుల్లో నే కన్నడ లో దాదాపు 200 రోజుల పాటు థీయేటర్స్ లో ఆడింది. పునీత్ రాజ్ కుమార్ హీరో గా చేసినా తన మొదట సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చు కున్నారు. అంతలా అప్పు సినిమా ఆ రోజుల్లో ఆడింది.