ఆ విష‌యం లో వెన‌క‌డుగు వేసిన బిగ్ బీ ?

Dabbeda Mohan Babu
భార‌త దేశ సినిమా చ‌రిత్ర‌లో హీరోలంద‌రిలో కంటే ఎక్కువ అభిమానుల‌ను సంపాధించుకుంది బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్. బాలీవుడ్ తో పాటు దేశంలో ఉన్న అన్ని సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌కు పెద్ద దిక్కుల ఉంటాడు. ఈయ‌న తీసుకునే నిర్ణ‌యాలు కూడా చాలా లోతుగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటాడు. ఆయ‌న చరిత్ర‌లో ఇంత వ‌ర‌కు చాలా త‌క్కువ మంది కి సారీ చెప్పి ఉంటాడు. అంత ప‌క‌డ్బంధీ గా న్యాయం గా ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకుంటాడు. అలాగే ఈయ‌న ఇంత వ‌ర‌కు ఎలాంటి వివాదా ల్లో కూడా చిక్కు కోలేదు. కానీ బిగ్ బీ అమితాబ్ బచ్చ‌న్ ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం త‌ప్పు అని నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అంద‌రి లాగా బిగ్ బీ కూడా డ‌బ్బుల కు అమ్ముడు పోయి చెత్త‌ యాడ్ లు చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు.


అస‌లు విష‌యం ఎంటి అంటే గ‌త కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బిగ్ బీ అమితామ్ బ‌చ్చ‌న్ ఒక పాన్ మసాలా కంపెనీ కి అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. అంతే కాకుండా ఆ బ్రాండ్ పాన్ మసాలా ను ప్ర‌మోట్ చేస్తూ యాడ్ కూడా చేశాడు. అది యాడ్ కూడా టీవీ ల్లో ప్ర‌సారం అవుతుంది. అయితే అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌మోట్ చేస్తున్న పాన్ మసాలా లో పొగాకు ఉత్ప‌త్తి ఉంటుంద‌ట‌. అయితే ఆ పొగాకు నిషేధంలో ఉంది. దీంతో నిషేధిత పొగాకు ను బిగ్ బీ ప్ర‌మోట్ చేస్తున్నాడ‌ని బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ను సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేశారు. అలాగే నిషేధిత పొగాకు ను ప్ర‌మోట్ చేయ‌వ‌ద్ద‌ని నేష‌న్‌ల్ యాంటీ టొబాకో ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌తి నిధులు కూడా బిగ్ బీ కి విజ్ఙ‌ప్తి చేశారు. దీంతో పాన్ మసాలా కంపెనీ తో చేసుకున్న ఒప్పంధాన్ని బిగ్ బీ ర‌ద్దు చేసుకున్నాడు. అలాగే వారు ఇచ్చిన పారితోషికాన్ని కూడా వెన‌క్కి ఇచ్చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: