ఇండస్ట్రీ నుంచి దళితులను గెంటేయ్యాలి..?

MOHAN BABU
 ప్రస్తుతం మనం ఆదిమ నాగరికత నుంచి ప్రాచీన నాగరికతలోకి అడుగు పెట్టాం. ఎంతో అభివృద్ధి సాధిస్తు న్నాం. ప్రపంచ దేశాల అన్నింటిని చుట్టి వేస్తున్నాం. నేల నుంచి నింగి వరకు ప్రయాణం చేస్తున్నాం. అరచేతిలోనే ప్రపంచం మొత్తాన్ని చూడగలిగే టెక్నాలజీని తెచ్చుకున్నాం. ఎన్నో అద్భుతాలు సృష్టించుకున్నాం. ఇంకా ఎన్నో అద్భుతా లకు శ్రీకారం చుడుతున్నారు. అయినా ఈ కులం, మతం అనే వివక్ష మాత్రం పోవడం లేదని చెప్పవచ్చు. అదేదో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే  విద్య  తెలియని వారు కులమత వివక్ష చూపించారంటే వారికి  ఏమీ తెలియదు అనుకుందాం. బాగా చదివి ఎప్పుడూ అప్డేటెడ్ గా  ఉండేటువంటి  సినీ నటులే కుల,మత వివక్ష చూపిస్తే  ఇక మామూలు జనాల పరిస్థితి ఏంటి.


 తాజాగా ఈ నటి దళిత కులం పై తీవ్రమైన విమర్శలు చేసింది.  సినీ ఇండస్ట్రీలో  దళిత కులస్తులను బయటకి గెంట యాలి, అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు పేరు మీరా మిథున్. ఈ కామెంట్స్ తో తమిళనాడులో ఈమెపై కేసుల మోత మోగుతోంది. ఏది ఏమైనా కులాలను విమర్శించడం, కించపరచడం అనేది నేరం. క్షమించరాని తప్పు. అలా మాట్లాడిన వారిని శిక్షించాలని చట్టాలు కూడా చెబుతున్నాయి. ఎన్ని చట్టాలు చెప్పినా కొందరు మాత్రం మారడం లేదని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా ఈ హీరోయిన్ అదే పని చేసింది. ఏకంగా సినిమా ఇండస్ట్రీలో నుంచి షెడ్యూల్డ్ కులాలతో పాటు, దళిత కులాలను  బయటకు గెంటి వేయాలంటూ తీవ్రమైన  మాటలు మాట్లాడింది. ఈమె మాటలు తమిళనాడు రాష్ట్రం సంచలనం సృష్టించాయి. ఇంతటి వివాదస్పదమైన వాక్యాలు చేసినటువంటి ఆ హీరోయిన్ పేరు మీరా మిథున్.  ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ తమిళ పరిశ్రమలో షెడ్యూల్ కులాల నుంచి వచ్చినటువంటి దర్శకు లు, నటీనటులు  ఎవరైనా కూడా  బయటకు వెళ్లిపోవాలని వాళ్లను బయటకు గెంటి వేయాలని ఆరోప ణలు చేసింది. ఈ యొక్క హీరోయిన్ కు తమిళ నాడులో యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపు ఉంది. ఈమె దళిత కులాల వల్లే  మంచి సినిమాలు రావడం లేదని, వాళ్ల పద్ధతులు, వ్యవహార శైలి బాగుండదని ఆమె తెలియజేసింది.


తన ఫోటోను ఒక దర్శకుడు తీసుకొని తన యొక్క అనుమతి లేకుండా సినిమా యొక్క మొదటి లుక్ కోసం వాడడని ఆరోపణ చేసింది. ఆయన దళిత కులానికి చెందిన వాడే అని అన్నది మీ రా మిథున్.. ఈ యొక్క సినీ పరిశ్రమలో ఉన్న షెడ్యూల్ కులాల వాళ్లకు అనేక నేరాల తో సంబంధం ఉందని వీడియోలో తెలియజేసింది మీరా. అయితే ఆమె చేసినటువంటి తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో దళిత సంఘాలు ఈమెపై తీవ్రంగా మండిపడుతున్నాయి. మీరా మిథున్ పై  అనేక చోట్ల కేసులు కూడా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: