పాకిస్తాన్ ను వేటాడాల్సిందే - ఇక క్షణం ‘ఆలశ్యం అమృతం విషం‘


125 కోట్ల జనవాహిని. ఆ సేతు శీతాచలం నేడు ఉడికిపోతుంది. యూరి సెక్టర్లో పాక్ ఉగ్ర మూకలు 18 సెప్టెంబర్ వేకువ ఝామున 5.30 నిముషాలకు నిద్రిస్తున్న భారత సైనికులపై నిర్దాక్షిణ్యంగా దాడిచేశాయి. 17 మంది భారత సైనికులను చంపి వారి రక్తదాహం తీర్చుకున్నాయి. క్షణక్షణం భారత్ ఉగ్రదాడికి బలౌతూనే ఉంది. దీనికి మన దాయాది దేశం కారణం. ఉగ్ర పాములకు జన్మ నిచ్చి పాలు పోసి పెంచి మన దేశం పై విషం చిమ్మిస్తుంది. 


భారత్ విభజన అనంతరం - స్వతంత్రం వచ్చినప్పటి నుండి విడిపోయిన మన దాయాది దేశం పాకిస్తాన్ విషనాగై మనపై పగబట్టి జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో మత చిచ్చు రగిల్చి మొత్తం దేశం పై ఉగ్రతండాల్ని తోలి, రక్తపాతం సృష్టిస్తుంది. పాకిస్తాన్ వల్లనే ప్రజా సంక్షేమానికి అభివృద్దికి ఖర్చు చేయాల్సిన నిధులను దేశ రక్షణ బడ్జెట్ కు కేటాయించి దేశాభివృద్ధి మందగించి పేదరికం దేశమంతా ముసురుకునే దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది.


తెలుగువారైన జెసి దివాకరరెడ్డి గారు అన్నట్లు 10 కోట్ల మంది భారత జనాభా మరణించటానికైనా సిద్దమే భారత మాతకున్న 125 కోట్ల సంతానములో దేశ రక్షణకు ఒక 10% సరిహద్దులకు తరలటానికి సిద్ధపడదాం. పాక్ ఇక విశ్వచిత్ర పటముపై ఉనికిని కలిగి ఉండటానికి ఏలాంటి అవకాశం ఇవ్వకూడదు.


పాక్ ఎంత? దాని పరిమాణం ఎంత? భారత ప్రజానీకం ఒక్కసారి ఉమ్మేస్తే చాలు ఆ ఉమ్మి వరద లో కొట్టుకుపోయేంత కూడా లేని దాని సంఖ్యెంత? ఐ ఎస్ ఐ లాంటి దుష్టవ్యవస్థను సృష్టించి భారత్ పై నరమేధం సాగించే దుష్ట పొరుగు మనకవసరం లేదు. చిన్న దేశాన్ని సంతోషంగా, సంతృప్తికరంగా పాలించుకోగల వ్యవస్థని నిర్మించుకోలేని సత్తా లేని ప్రజానీకం. ప్రజల సొమ్ము తింటూ వారికి ప్రశాంత జీవనం ఇవ్వలేని సైన్యం, వారి శవాల పైనే పేలాలు ఏరుకొని విలాస జీవితం గడిపే రక్తపింజరులు నివసించే   పాకిస్తాన్ లాంటి దేశానికి ఒక జన జాతి కుండవలసిన లక్షణం ఏ ఒక్కటీ లేదు. 

విర్రవీగే రక్త పిచాచి - పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ చీఫ్


అహింస పరమోధర్మః అని భావించే భారత జాతిపై రక్తవర్షం కురిపించే కర్కోట, కిరాత, కీచకుల నాయకత్వము లోని పాక్ ను ఆదేశ నాయకత్వములోని మానవత్వం నిద్రలేపటానికి తనదైన  విజ్ఞతను, సహనాన్ని, ముందుగా స్పందించటముతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వ్యక్తిగతంగా భారత ప్రజల మనసు నొచ్చుకున్నా లక్ష్య పెట్టక తన స్నేహ హస్తాన్ని అందించటాన్నికి పాకిస్తాన్ వెళ్ళి ఆయన జన్మదినాన్ని పురస్కరించు కుని కలసి రావటం ఆయనలోని "భాతృత్వాన్ని" శ్లాఘించ వలసిందే. ఇక ఇప్పుడు స్నేహం మనకవసరం లేదు. ఆ దుష్ఠ కీటకాన్ని సం-హరించవలసిందే. ఇక ఒక్క క్షణం ఆలశ్యం కూడా అమృతాన్ని విషంగా మారుస్తుంది.


నాటి తొలితరం భారత పాలకుల అవివెకమో, అతి మంచితనమో, అమాయకమో భారత్ మోసపోయింది. విభజనను అంగీకరించింది. అదే భయానకమైన తప్పిదం. దాని ప్రతిఫలమే మనం మన జమ్ము & కాశ్మీర్, పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ 70 సంవత్సరాల నుండి ఈ నరకం భరించవలసి వస్తుంది. దేశం ఆర్ధికంగా, నైతికంగా, రాజకీయం గా ఎంతో నష్టపోయాం. పాకిస్తాన్ విభజన జరగక పోయి ఉంటే భారత్ ఒక ఉపఖండంగా మిగిలిపోయేది. 10 కోట్ల ప్రజలు మరణించైనా మళ్ళా భారత ఉపఖండాన్ని నిర్మించుకోవచ్చు. అపరకాళి లా నాటి ప్రధాని ఇందిరాగాంధి చూపిన తెగువనే ఇంకా ఎక్కువ పటుత్వాన్ని నరెంద్ర మోడీ ప్రదర్శించి పాకిస్తాన్ పీచమణచటం జాతికి కర్తవ్యం కావాలి.


అంతే కాదు పాకిస్తాన్ ను సమర్ధించే చైనాను అంతర్జారీయంగా ఏకాకులను చేయాలి. పాకిస్తాన్ కు ఉనికే లేకుండా చేయటమే ఈ భారత తక్షణ కర్తవ్యం కావాలి. దీన్ని ఆదర్శవంత చేయటానికి ముందుగా మనమంతా ఐకమత్యం ప్రదర్శించాలి.


ఈ దిన దిన మరణం కంటే ఒక్క సారి భారత ప్రజ సరిహద్ధులకు కదలటం, పోరాటం మన ఉనికి కి ఇప్పుడు చాలా అవసరం. అవసరమైతే 1947 తొలినాళ్ళ నాటి భారత్ ను మరల సృష్టించాలి. పాకిస్తాన్ ను విశ్వచిత్రపటం పై నుండి "డిలీట్" చేయటం తక్షణ కర్తవ్యం కావాలి. ప్రధాని, హోమ్మంత్రి, రాష్ట్రపతి అద్భుతంగా స్పందించారు. మరణించిన మన సైనిక సోదరుల ఆత్మలు సంతోషించేలా దోషులను శిక్షించాలి. దానికి పాకిస్తాన్ సహకరించాలి. అది జరగక పోతే పాకిస్తాన్ పై సైనిక చర్యకు వెనుకాడరాదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: