రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. అడుగు బయట పెట్టినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేవరకూ ఆడపిల్లలతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా బిక్కుబిక్కుమనే పరిస్థితి దాపురించింది.మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నిందితులపై ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల్లో మాత్రం భయం కలగడం లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఓ మూలన లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలో మహిళపై అత్యాచారయత్నం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తాజాగా తాడేపల్లి లో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు అత్యాచారయత్నానికి గురైన మహిళ కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ప్రయత్నించాడు.
దింతో సదరు మహిళ భయంతో మాజీ సీఎం జగన్ ఇంటి వైపు పరుగులు తీసింది. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.దీని పై మరింత సమాచారం తెలియాల్సి వుంది.ఇదిలావుండగా భారతదేశంలో ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురికావడం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత విషమంగా ఉందో చెబుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 34 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, వరకట్నం కోసం ప్రతి 99 నిమిషాలకు ఒక వధువు బలి అవుతోంది. ఇటువంటి అరాచకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ సంఘటనల పై గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే రోజుకో సంఘటన మనం చూడాల్సి వస్తుంది.