ఎన్టీఆర్ ను బిర్యానీతో సర్ ప్రైజ్ చేసిన ప్రముఖ డైరెక్టర్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.  ఒక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మొత్తం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ కి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ అమ్మ చేసే రొయ్యల బిర్యాని అంటే ఎంతో ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి చెఫ్ కూడా. షూటింగ్ లేని సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎన్టీఆరే స్వయంగా మటన్ బిర్యానీ కూడా తయారు చేస్తూ తన సమయాన్ని గడుపుతూ ఉంటారట. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ కోసం ఒక డైరెక్టర్ బిర్యానీ తీసుకొచ్చి ఎన్టీఆర్ ను సర్ప్రైజ్ చేశారు.

అయితే బిర్యానీ అక్కడ ఇక్కడ బిర్యానీ కాదు.. ఏకంగా చెన్నై నుంచి వస్తూ ఎన్టీఆర్ కోసం బిర్యాని పార్సల్ తీసుకొచ్చారట ఆ డైరెక్టర్. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి  చెన్నై బిర్యానీ అంటే తెగ ఇష్టం ఇక ఈ విషయాన్ని కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ అందరికీ తెలిపిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోని డైరెక్టర్ అట్లీ ఎన్టీఆర్ కు ఒక కథ వినిపించాలి అనుకొని ఎన్టీఆర్ దగ్గరకు రావాలి అని ఫోన్ చేసి చెప్పారట. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తున్న సమయంలో.. ఎన్టీఆర్ అట్లీ కి ఫోన్ చేసి తలపాకట్టి బిర్యానీ తీసుకురావాల్సిందిగా కోరినట్లు సమాచారం.
దీంతో ఎన్టీఆర్ కోసం అట్లీ బిర్యానీ ఆర్డర్ చేశారట.. కానీ సునీల్  అయితే వచ్చి తిని వెళ్ళచ్చు కదా అని అట్లీ తో తనకున్న పరిచయంలో సునీల్ తెలపగా .. కానీ అది తన కోసం కాదు అని ఎన్టీఆర్ కోసం అని చెప్పారట.. దాంతో వెంటనే సునీల్ కూడా షాక్ అయినట్లు  తెలిపారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఆ తర్వాత అట్లీ డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: