నీకు హాట్సాఫ్ తల్లి.. కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసింది?

praveen
ఇటీవల కాలంలో ఎవరు ఎటు పోతే నాకేంటి నేను సంతోషంగా ఉన్నానా లేనా అని ఎంతో మంది స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఇక కుటుంబాలను నడిరోడ్డు మీద వదిలేసి ఇక స్వార్థం చూసుకుంటున్న వారు ఎంతోమంది. కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సిన వయసులో కూడా అలాంటివి చేయడం లేదు ఎంతోమంది. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసి ప్రస్తుతం అందరితో శభాష్ అనిపించుకుంది. స్వార్ధంతో కూడిన నేటి లోకంలో కూడా నిస్వార్థంగా కుటుంబం కోసం శాయశక్తులా కష్టపడుతోంది ఆ యువతి.

 గతంలో కతర్ దేశం లో చెఫ్ గా పని చేస్తూ ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపింది ఆ యువతి. ఇక అక్కడ సంపాదించిన డబ్బుతో తమ్ముడికి పెళ్లి చేసింది. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని ఘటన ఎదురైంది. విశాఖ లో ఉంటున్న ఆమె తల్లి అనారోగ్యం బారిన పడింది. దీంతో పదేళ్ల కిందట ఖాతార్ నుంచి విశాఖ వచ్చేసింది. అప్పటి నుంచి ఎంతో కష్ట పడుతూ ఇక అమ్మకు చికిత్సను అందిస్తూ.. బతికించుకోవడం కోసం కష్టపడుతుంది. తన చిన్నతనంలోనే చనిపోవడంతో ఇక కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని సరస్వతి పదేళ్లుగా ఎన్నో కష్టాలు చవిచూసింది.

 ఈ క్రమంలోనే తెలుగు హిందీ ఇంగ్లీష్ కతర్ తమిళం మలయాళం లాంటి ఎన్నో భాషలు వచ్చు. ఎంతో టాలెంట్ వున్న ప్పటికీ తల్లి కోసం సొంతంగా చిన్న వ్యాపారాలు చేస్తూ మెల్లిమెల్లిగా అప్పులు తీరుస్తుంది. ఉదయం 6 గంటల నుంచి వ్యాపారం మొదలు పెడుతుంది.  ఉదయం తో బొకేలు అమ్ముతుంది. మధ్యాహ్నం నుంచి బీచ్ రోడ్ లో ఉన్న కతర్ లో నేర్చుకున్నా ఫాస్ట్ఫుడ్ ను విక్రయిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఆ యువతి. ప్రస్తుతం ఆ యువతి పట్టుదల పై ఎంతో మంది ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: