అమ్మ: గర్భిణీలు అస్సలు చేయకూడని పనులివే..??

N.ANJI
బిడ్డకు జన్మనివ్వడం ప్రతి స్త్రీకి అదో పెద్ద వరం. పెళ్ళైన ప్రతి మహిళ గర్భం దాల్చాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అయితే వారు కోరుకున్నట్టుగానే గర్భం దాల్చితే ఆ మహిళ ఎంత ఆనంద పడుతుందో మాటల్లో వర్ణించలేమని చెప్పాలి. పండంటి పాపాయికి జన్మనివ్వాలంటే గర్భధారణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు తీసుకునే ఆహారం, వేసుకునే బట్టలు, చేసే పనులు ఇలా అన్ని విషయాల్లోనూ ఎంతో శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.
అంతేకాదు.. గర్భం దాల్చిన మహిళలు కొన్ని కొన్ని పనులకు కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాల గురించి ఒక్కసారి చూద్దామా. అయితే సాధారణంగా చాలా మంది గర్భిణులు తెలిసో తెలియకో పెద్ద పెద్ద బరువు ఉన్న వస్తువులు, వాటర్ బకెట్లు మోసుకెళ్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కండరాలు బలహీనంగా మారడం, పొట్ట సాగిపోవడం వంటి జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక మరికొంత మంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో బట్టలు ఉతకడం వంటి పనులు చేస్తూ ఉంటారు. కాగా.. బేబీ బంప్‌తో వంగుతూ.. లేస్తూ బట్టలు ఉతకడం అనేది చాలా కష్టమైన పని కావడంతో.. అలా చేయడం వలన మీతో పాటు కడుపులోని బిడ్డ కూడా అసౌకర్యానికి గురవుతారని చెబుతున్నారు. అలాగే గర్భధారణ సమయంలో బట్టలు ఉతకడం వంటి పనులు చేయకూడదని అంటున్నారు.
ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మహిళలు ఇల్లు తుడవడం, బాత్రూంలు కడగడం వంటివి పనులు చేస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని.. ఎందుకంటే.. ఇల్లు తుడవడానికి, బాత్రూంలు కడగడానికి వాడే లిక్విడ్స్‌లో పలు రకాల కెమికల్స్ ని వాడుతుంటారు. ఇక వాటిని పీల్చితే కడుపులో బిడ్డకు హానికరంగా మారతాయని అందుకే అలాంటి పనులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: