అమ్మ: గర్భిణులు టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలివే..??

N.ANJI
ఓ శిశువుకి జన్మనిచ్చే గొప్ప వరం కేవలం మహిళకు మాత్రమే సొంతం. ఇక పెళ్ళైన ప్రతి మహిళ గర్భం పొందాలని.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అయితే.. గర్భధారణ సమయం ఎంత మధురంగా ఉంటుందో.. అంతే క్లిష్టతరంగా కూడా ఉంటుందనే చెప్పాలి మరి. అంతేకాదు.. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ మహిళలు తమ కడుపులో పెరిగే బిడ్డకు మేలు చేసే ఆహారాలను డైట్‌లో తీసుకోవాలని చెబుతున్నారు.
అంతేకాదు.. గర్భిణీ మహిళలకు కొన్ని కొన్ని టీలు ఎంతో మంచి చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టీలు ఏంటో ఒక్కసారి చూద్దామా. గర్భధారణ సమయంలో చాలా మంది గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అంతేకాదు.. ఈ సమస్యలను నివారించడంలో సోంపు టీ అద్భుతంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు కప్పు చొప్పున సోంపు తీసుకుంటే.. జీర్ణ సమస్యలు దరి చేరకుండా ఉంటాయని తెలిపారు.
ఇక గర్భిణులు అల్లం టీ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో తరచూ ఇబ్బంది పెట్టే వాంతులు, వికారం, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలను అల్లం టీ సమర్థవంతంగా నివారిస్తుందని తెలిపారు. ఇక మంచిది కదా అని అధికంగా మాత్రం అల్లం టీని తీసుకోకూడదని చెబుతున్నారు. అంతేకాదు.. వారంలో రెండు లేదా మూడు సార్లు ఒక కప్పు చొప్పున తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో తులసి టీ తీసు కోవడం కూడా ఎంతో మేలు జరుగుతుంది. గర్భిణులు తులసి ఆకులతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల.. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయని చెబుతున్నారు. ఇక గర్భధారణ సమయంలో  ఇబ్బంది పెట్టే జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్స్ , బాడీ పెయిన్స్ నివారించడంలో తులసి టీ దోహదపడుతుంది. ఇక ఈ టీను కూడా ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: