అమ్మ: గర్భిణులు రోజూ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పోషకాలివే..!!

N.ANJI
సాధారణంగా పెళ్లైన ప్రతి మహిళా ప్రెగ్నెన్సీని ఒక గొప్ప వరంలా భావిస్తారు. ఇక మిగిలిన సమయాలతో పోలిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజూ ఖచ్చితంగా కొన్ని పోషకాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పోషకాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.
గర్భిణులకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఐరన్‌ ఒక్కటి. అయితే శరీరంలో ఐరన్ లేకుంటే రక్త హీనత వస్తుందని నిపుణులు చెప్పుకొచ్చారు. దీని కారణంగా.. నీరసం, ఆలసట, తల నొప్పి వంటివి పెరిగిపోతాయని అన్నారు. అంతేకాదు..  ప్రసవం, పుట్టబోయే బిడ్డలో లోపాలు తదితర సమస్యలు ఇబ్బంది పెడుతాయని అన్నారు. అయితే ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, పుచ్చ గింజలు, పాలకూర, ఓట్స్‌, ఎండు ద్రాక్షలు వంటివి తీసుకోవాలని పేర్కొన్నారు.
అంతేకాదు.. ప్రెగ్నెన్సీ సమయంలో విటమిన్ డి కూడా ఎంతో అవసరం అని చెప్పుకొచ్చారు. ఇక తల్లీ, బిడ్డల ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బలపరిచి.. రోగాలు దరి చేరకూడదంటే విటమిన్ డి ఉండే గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, బఠాణీలు, పుట్టగొడుగులు వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో అయోడిన్ లోపానికి గురై థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి గర్భిణులు  ప్రతి రోజూ తగిన మోతాదులో అయోడిన్ ఉప్పు తీసుకోవడం మంచిది. పాల ఉత్పత్తులు, మొక్క జొన్నలు, తృణ ధాన్యాలు, రొయ్యలు తింటే అయోడిన్ దోహదపడుతుంది.
అయితే గర్భిణులు ప్రోటీన్‌, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్ సి పోషకాలను సైతం ప్రతి రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. ఈ పోషకాల కోసం ఉడికించిన శనగలు, బీన్స్‌, సిట్రస్ పండ్లు (పుల్లగా ఉండే ఫ్రూట్స్), అవకాడో, వాల్ నట్స్‌, బాదం, నెయ్యి, బ్రొకోలీ, టమాటా, అరటి పండ్లు, క్యారెట్ వంటి ఆహారాలు తీసుకోవచ్చునని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: