అమ్మ: ప్రెగ్నెన్సీ రావడం లేదా.. కారణాలివే..??

N.ANJI
ప్రస్తుత సమాజంలో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. వైద్యరంగంలోను టెక్నాలజీ పెరగడం వల్ల ఆ పద్ధతుల ద్వారా పిల్లలకు జన్మనిస్తారు అని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది భార్య భర్తలు పెళ్లయిన తర్వాత చదువు వల్ల కానీ కెరీర్ వల్ల కానీ లేదా సోషల్ కమిట్మెంట్స్ వల్ల కానీ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఎక్కువ కాలం దీనిని ఆలస్యం చేస్తూ ఉంటారు దీని కారణంగా తర్వాత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
చాలా మంది దంపతులు పిల్లల్ని కనడానికి కూడా వయసు ఉంటుందని.. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఇటువంటి వాటి గురించి పిల్లల్ని కనడం ఆలస్యం చేసుకుంటూ పోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. పురుషుల్లో కూడా స్పెర్మ్ యొక్క నాణ్యత తగ్గిపోతుందని.. వయసుతో పాటు దీనిలో కూడా మార్పు వస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడే పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాక.. అనారోగ్య సమస్యల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇక డయాబెటిస్, హైపర్టెన్షన్, ఒబేసిటి మొదలైన సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. దాని కారణంగా కూడా ఫర్టిలిటీ పై ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇక చాలా మందిలో లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం, హార్మోనల్ సమస్యలు, కాలుష్యం, పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం, పెల్విక్ ఇన్ఫెక్షన్, పిసిఓస్ వంటి వాటి వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు..  ఈ మధ్య కాలంలో  చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్య కేవలం పురుషుల్లో మాత్రమే కాదు స్త్రీలలో కూడా ఒత్తిడికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: