మహిళ : రుణాలు అందించే సంస్థలు ఏవో తెలుసా..?
వాటిలో ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ పథకం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్త్రీశక్తి పథకం, లఘు పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలకు పథకం, విషయం తెలుసుకున్న హుటాహుటిన చేరుకొని బందోబస్త్, చిన్న చిన్న వ్యాపారస్ధులకు ఋణ సహాయం, మహిళా చైతన్యానికి నాబార్డు పథకాలూ - ఋణాలు, డ్వాక్రా (గ్రామీణ ప్రాంత మహిళా, శిశు అభివృద్ధి), స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ - మహిళా ఉద్యమ నిధి, ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి పథకాలు మహిళల కోసం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
జాతీయబ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్టేట్ పైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్ధిక సంస్ధలు కూడా మహిళలకు ఋణాలు మంజూరు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నాబార్డ్ ' స్త్రీల కొరకే అనేక పథకాలు, వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నది. స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా, ఐ.ఆర్.డి.పి వంటి పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పించుకుంటూ, తమ ప్రాజెక్టు ద్వారా మరెంతోమందికి మార్గదర్శకులవుతున్నారు మహిళలు. వ్యాపార దృష్టి, పరిశ్రమల స్ధాపనలో చురుకుగా పాల్గొనే ఉత్సాహం ఉన్న స్త్రీలకు ఋణాలను అందించేదీ ఈ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పథకం. మహిళలు తమకు తామే ఒక స్వయం ఉపాధిని కల్పించుకోవడమే కాక, మిగిలిన వారికి కూడా ఒక ఆసరా ఇవ్వగలిగినవారవుతారు.