మహిళలకు కుంకుమ పువ్వు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Satvika
గర్భిణీలు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో చాలాసార్లు చెప్పుకున్నాము.. ఎక్కువ పొషకాలు, ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు చాలా మంచిది. మనం తీసుకొనే మంచి ఆరోగ్యం వల్ల బిడ్డ మెదడు చురుగ్గానే కాదు ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది..ఇకపోతే గర్భవతులు కుంకుమ పువ్వు తాగితే పిల్లలు ఎర్రగా అందంగా పుడతారు అని పూర్వకాలం నుంచి వినిపిస్తోంది. నిజంగా ఈ పువ్వును తాగితే పుడతారా? అనే సందెహాలు చాలా మందికి వస్తాయి.
ఈ విషయం పై ఆరోగ్య నిపుణులు ఏమన్నారంటే.. బిడ్డ రంగు అనేది జన్యువు నుంచి వస్తుంది అని చెబుతున్నారు.కానీ ఈ పువ్వు పాలను తాగడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయట.. అవేంటో తెలుసుకుందాం..
ఒత్తిడి గర్భవతులకు ఎక్కువగా ఉంటుంది. హార్మొన్లు చెంజ్ అవుతాయి. దానివల్ల నిద్ర తక్కువ అవుతుంది. సరైన నిద్ర లేకుంటే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్క్కొవాల్సి ఉంటుంది. ఈ కుంకుమ పాలు తాగడం వల్ల ఒత్తిడి దూరం చేసి మంచి నిద్ర కలిగేలా సహాయపడుతుంది..
అధిక రక్తపోటు నియంత్రణ..
ఎక్కువ ఆలోచనలు, హార్మొన్ల మార్పు, మనం తీసుకొనే ఆహారం వల్ల అధిక రక్త పోటు రావడం జరుగుతుంది. అటువంటి సమయం లో కొద్దిగా కుంకుమపువ్వు తీసుకుంటే అటువంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది.
ఇలాంటి సమయంలో ఆరోగ్యం కన్నా కూడా రుచిగా వుండే వాటిని తినాలని అనిపిస్తుంది.. అయితే అలా ఎక్కువగా ఆయిల్ వున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితి నుంచి కుంకుమ పువ్వు బయట  పడేలా చేస్తుంది.. బరువును కంట్రోల్ లో ఉంచుథుంది. అంతేకాదు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అలెర్జీలు రావడం దాని ద్వారా జలుబు, దగ్గు తరచూ జ్వరం రావడం వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటి నుంచి ఈ పువ్వు రక్షిస్తుంది.
ఈ పువ్వులో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో రొగాలను దరి చేరకుండా కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చాలా మంచిది.ఇది గుర్తు పెట్టుకోవాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: