మహిళా శక్తి గుర్తించేది..ఎప్పుడు..!

MOHAN BABU
స్త్రీ జాతిని ఆకాశంలో సగం అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తి వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే ఉన్నారు. చేతల దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మాటలు గాని  మిగిలిపోవడం కాయం. ఈ నేపథ్యంలో కొన్నేళ్ళ క్రితం ఒక వార్త కొన్ని పత్రికల్లో చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత  ప్రాముఖ్యత ఇవ్వలేదేమో, ఆ అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది. ఆ వార్త ఏమిటంటే ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న ఒక బహుళజాతి సంస్థ యాజమాన్యం తమ దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులను 24 వారాలకు పెంచింది. అంటే సుమారు ఆరు మాసాల పాటు  జీతంతో కూడిన సెలవు.

 అంతేకాదు ప్రస్తుతం సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరే ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు పనివేళల్లో వారికి వీలైన సమయంలో పని చేసుకునే వెసులుబాటు కల్పించింది. చట్టం ప్రకారం తనకు ఇవ్వాల్సిన సెలవులను మించి  ఈ కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయం కల్పించడం విశేషం. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్రభాష్యాలు వెలువడ్డాయి.తమ సంస్థలో పని చేసేందుకు అధిక సంఖ్యలో ఆడ వారిని ఆకర్షించేందుకు ఆ కంపెనీ ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం. నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మన దేశంలో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం. ఓ 60 ఏళ్ల క్రితం ఆడపిల్ల అంటే గడపదాటి అడుగు బయట పెట్టడం చాలా కష్టం. ఆడపిల్లలకు చదువు ఎందుకు ఇంట్లో ఏవో పద్దులు రాసుకునే అక్షరాస్యత ఉంటే చాలు అని పెద్ద వాళ్ళు అంటూ ఉండటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పల్లెల్లో కూడా లేవు. మారడం కాలధర్మం. అందుకే కాలం మారింది, ఇంకా మారుతోంది. మగ,ఆడ తేడా చదువులో లేకుండాపోయింది. కాకపోతే చదువుకున్న ఒక తరం ఆడవాళ్లు చదివిన చదువుకు సార్థకం లేకుండా మళ్లీ గృహిణులు గానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్లు పని చేయాల్సిన కొత్త కొలువులు వచ్చిపడ్డాయి. మంచి మంచి జీతభత్యాలు,పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు  కూడా తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. మగపిల్లల మాదిరిగానే కన్న తల్లిదండ్రులను,ఉన్న ఊరిని విడిచి వెళ్ళి పరాయి ఊర్లోనే కాదు, పరాయి దేశాల్లో కూడా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు.ఆ మేరకు వారికి జాతి రుణపడి ఉండాలి. ఆడవాళ్లు చేసే ఇంటి పని కూడా పరిగణలోకి తీసుకుంటే బయట పనిపాటల్లో వారికి వస్తున్నది.

 నామామాత్రమే. ఇలాంటి వారు నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. పనికి తగ్గ వేతనాలు ఉండవు. 50 ఏళ్ల క్రితం గడపదాటని ఆడవాళ్లను చూశారు. అదే కళ్లతో చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళను చూస్తున్నారు. కాలధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్లు చివర చెప్పిన బడుగు,బలహీన వర్గాల ఆడవారికి కూడా మంచి కాలం రాకపోతుందా అని చూడక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: