అమ్మ: పాలిచ్చే తల్లులు ఈ ఫుడ్స్ తింటే యమ డేంజరు..!?

N.ANJI
గర్భిణులు ప్రసవానికి ముందు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో.. ప్రసవం తర్వాత కూడా అంతే జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తల్లులు ఆహారం విషయంలో అనేక నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తల్లి తినే ఆహారమే బిడ్డకు పాల రూపంలో వెళ్తుందనే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు. మంచి ఆహారం తీసుకోనట్లయితే తల్లీబిడ్డ ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త పాటించాలి. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.. ఏ ఆహారాన్ని అవాయిడ్ చేయాలో తెలిసి ఉండాలి.
ఆహారం విషయంలో తల్లులకు ఇంట్లో పెద్దవాళ్లు అనేక సూచనలు చేస్తుంటారు. వెల్లుల్లి తింటే పాలు వృద్ధి చెందుతాయని చెబుతుంటారు. అందుకే పాలిచ్చే తల్లులకు వెల్లుల్లిని ఆహారంగా తీసుకుంటారు. అయితే వెల్లుల్లి తీసుకోవడం వల్ల అందులోని అల్లిసిన్ అనే రసాయనం పాల వాసనను మార్చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. పాలు వాసన రావడం వల్ల పిల్లలు పాలు తాగేందుకు నిరాకరిస్తారని.. తల్లులు వెల్లుల్లికి దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. దీంతోపాటు క్యాబేజీకి కూడా తల్లులు దూరంగా ఉండాలి. ఎందుకంటే క్యాబేజీ తినడం వల్ల తల్లులకు గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని తల్లులు తీసుకున్న తర్వాత పిల్లలకు పాలు పట్టిస్తే వారికి కూడా జీర్ణ సమస్యలు వస్తాయి.
గర్భిణులు, తల్లులు టీ, కాఫీ జోలికి వెళ్లకూడదు. టీ పొడిలో ఉండే కెఫిన్ తల్లీబిడ్డకు ఎంతో డేంజరు. కెఫిన్ వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. దీంతో మానసిక రుగ్మతల సమస్య ఎక్కువ అవుతుంది. కాఫీ తాగడం ఎంత ఇష్టమున్నా.. కొద్ది రోజులపాటు వాటిని అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లాడికి కూడా పోషకాలు నిండిన పాలు అందుతుంది. దీంతో తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: