అమ్మ: గర్భిణులు యూరినేషన్ సమస్యతో బాధపడుతున్నారా..??

N.ANJI
గర్భధారణ సమయంలో గర్భిణులు పోషణకరమైన ఆహార పదార్దాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు మంచి ఆహారాన్ని తీసుకోవడం ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంచిదని చెబుతున్నారు. సాధారణగా గర్భధారణ సమయంలో ఆకలిని కోల్పోవడం అనేది సహజం. ఇక ఇలా ఆకలిని కోల్పోయినపుడు ప్రెగ్నెన్సీ స్త్రీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఇక ఈ సమస్య అందరిలో కామన్ గా జరిగే విషయమే అని లైట్ తీసుకోవాలని తెలిపారు. అయితే ఆకలి వేయడం లేదు కదా అని ఏమీ తినకుండా ఉండకూడదని సూచించారు. గర్భిణులు ఏమీ తినకుండా ఉండడం వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు.. గర్భవతిగా ఉన్నపుడు ఆకలి వేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో ఏది చూసిన వికారం కలుగుతూ ఉంటుందని అన్నారు. అంతేకాదు.. ఏదీ తినేందుకు గర్భవతులు ఆసక్తిని చూపించారని అన్నారు. కాగా.. ప్రెగ్నెసీ సమయంలో పలు సమస్యలు కూడా వస్తుంటాయి.
అయితే సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన చాలా మంది స్త్రీలలో యూరినేషన్ సమస్య అధికంగా వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఇక ఇలా అధికంగా యూరిన్ ఎందుకు వస్తుందని చాలా మంది డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. అయితే మామూలు వ్యక్తులు సీజన్ ను బట్టి యూరిన్ కు వెళ్లడం సహజమే. అయ్యినప్పటికీ ప్రెగ్నెన్సీ స్త్రీలకు సీజన్ తో సంబంధం లేకుండా యూరిన్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు.
ఇకపోతే నార్మల్ వ్యక్తులు సమ్మర్ సీజన్ లో తక్కువగా, మిగతా వింటర్ సీజన్, మన్ సూన్ సీజన్లలో అధికంగా యూరిన్ కు వెళ్తారని తెలిపారు. అంతేకాక.. ప్రెగ్నెన్సీ స్త్రీలలో అలా ఉండదని అన్నారు. కాగా వారు ఏ సీజన్ లోనైనా సరే చాలా ఎక్కువ సార్లు యూరిన్ కు  వెళ్తారని వెల్లడించారు. ఇక ఎక్కువ సార్లు యూరిన్ కు వెళ్లడం వలన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా.. అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. అయితే అటువంటిది ఏదీ ఉండదని ఇప్పటికే అనేక మంది వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: