మీ ఇంటిని చిన్న మార్పులతో అందంగా మార్చుకోండి...

VAMSI
ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. అంటే ఆ ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఆ ఇంటి ఇల్లాలు గుణగుణాలు తెలుస్తాయని వారి ఉద్దేశ్యం కాబోలు. ఇందులో నిజం లేకపోలేదు మహిళలు తమ గుణగుణాలను నిజంగానే ఇంటిని అలకరించే పద్దతిలో ఇతరులకు తెలియచేయవచ్చు. అంతేకాదు ప్రస్తుత జనరేషన్ లో అందమైన ఇల్లు అనేది ఒక స్టేటస్ సింబల్ లా మారిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఇల్లును అలకరించుకునే తీరును బట్టి ఆ ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుంది అన్నది ఆధారపడి ఉంటుంది. ఇంటిని చక్కదిద్దే పాత్ర ఎక్కువగా మహిళలే పోషిస్తుంటారు. ఇక ఇంటిని అందంగా ఆకర్షణీయంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు ఓ సారి చూద్దాం.
కొన్ని చిన్న చిన్న మార్పులు మీ ఇంట్లో చేసుకుంటే ఆ ఇల్లు చాలా అందంగా కనబడుతుంది. వచ్చిన వారు, చూసిన వారు ఇక ఆ ఇంటి ఇల్లాలిని ప్రశంసించకుండా అస్సలు ఉండలేరు.
* ముందుగా ఏ ఇల్లు అయినా గోడలపై మరకలు లేకుండా చూసుకోండి. మంచి కలర్ తో పెయింటింగ్ ఉండేలా చూసుకోండి.
 
*హిందువులు అయితే ఇంటి బయట ఓ వైపు తులసి చెట్టు మరో వైపు మని ప్లాంట్ ని పెంచండి. ఈ మొక్కలను ఉంచే కుండీలు ఆకర్షణీయంగా ఉండేలా పసుపు కుంకుమలతో అలకరించండి. ఇది భక్తి శ్రద్ధలతో చేయండి.
*ఇంటి ముందు పచ్చని మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తాయి. వీలైతే రకరకాల పూల కుండీలను కూడా పెంచండి.
* వంటిల్లు ఆడవారి సామ్రాజ్యం అంటుంటారు. ఇది చాలా క్లీన్ గా ఉండాలి. వంటింటిని లక్ష్మి నివాసం అని కూడా అంటుంటారు, కాబట్టి చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోగలం. వంటింటిని ఎంత నీట్ గా సర్దుకున్నారు వంట చేసేటప్పుడు మాత్రం ఎక్కడివక్కడ చెల్లా చెదురుగా అయిపోతాయి. అయితే తీసిన వస్తువును పని అయిపోగానే వెంటనే వెనక్కి దాని స్థానంలో పెట్టేస్తే వంటిల్లు సర్దుకోవడం పెద్ద కష్టం కాదు. వంట అయిన వెంటనే వంటిల్లు క్లీన్ చేసుకోవాలి.
* ఇక ఇంట్లో హాల్ లోని షెల్ఫ్ లు ఎప్పుడూ అందమైన బొమ్మలతో, ఫ్లవర్ వాజులతో నింపాలి. అప్పుడే ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.  కానీ షెల్ఫ్ లను ఎప్పటికప్పుడు దుమ్ము పట్టకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
*ఇంట్లో పూజ గది కూడా ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి.
* ఒక టైం టేబుల్ ప్రకారం పనులు చక్కబెట్టుకుంటూ పోతే అన్ని పనులు సమయానికి సరిగ్గా జరుగుతాయి.
* ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా కనిపించాలి.
అప్పుడే మీ ఇంటికి ఎవరు వచ్చినా అబ్బా... మీ ఇల్లు ఎంత బాగుందో అని అంటారు. వారికి మీరు ఇల్లును ఎలా అందంగా మార్చుకోవాలి అనే విషయంలో ఒక రోల్ మోడల్ గా నిలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: