అమ్మ: గర్భిణులకు వాంతులు ఎందుకు అవుతాయి..??

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భం దాల్చిన వారిలో కొంతమందికి తీవ్రంగా వాంతులు అవడం, మరికొందరికి వేర్వేరుగా ఉంటుంది. ఆ సమయంలో వైద్యులను సంప్రదించి వారి సలహాలను పాటించాలని సూచిస్తుంటారు. అయితే ఒక్కసారి కన్ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ మిస్ క్యారేజ్ అయితే ఆ జంటలు పడు బాధను మాటల్లో వర్ణించలేనిది.
అంతేకాదు.. గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మొదలుపెడుతుంటారు. అయితే కొందరికి తీవ్రంగా వాంతులు అవడం, మరికొందరికి వేర్వేరుగా జరుగుతూ ఉంటుంది. ఇక అందుకోసం వైద్యులను సంప్రదిస్తే వారు ఇటువంటి వాటికి తగిన సలహాలు, సూచనలు చేస్తుంటారు.
గర్భధారణ నిర్దారణ అయ్యాక చాలా మంది మహిళలో ఆకలి మందగిస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి సందేహాలు కలుగుతుంటాయి. సాధారణంగా మహిళలు గర్భం దాల్చినపుడు స్త్రీ శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అయితే గర్భం దాల్చిన స్త్రీలలో పొట్ట భాగంలో అనూహ్య మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాక.. పొట్ట భాగంలో మాత్రమే కాకుండా ఛాతి భాగంలో కూడా అనేక మార్పులు సంభవిస్తాయని అంటుంటారు. అంతేకాక.. అనేక రకాలుగా స్త్రీల శరీరం మారడానికి వారిలో రిలీజయ్యే హర్మోన్లు కూడా ఒక కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా.. ఈ విషయాన్ని స్త్రీలందరూ గుర్తించాల్సి ఉంటుందని అన్నారు.
గర్భధారణ సమయంలో స్త్రీలు చాలా అన్ కంఫర్ట్ గా ఫీలవుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వారి జీవన విధానాలను కూడా మార్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. గర్భిణీ సమయంలో మహిళల్లో వచ్చే మార్పుల గురించి చింతిచాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అంతేకాదు.. మహిళల్లో విడుదలయ్యే హర్మోన్లలో కూడా హెచ్చుతగ్గులు వస్తాయని అంటున్నారు.
ఇక లెప్టిన్, హర్మోన్, ప్రెగ్నెన్సీ వచ్చేందుకు ప్రధాన కారణమైన హ్యూమన్ క్రోనిక్ గోండోట్రోపిన్ హర్మోన్ల వలన ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వికారం, తిమ్మిరి వంటివి వస్తాయని తెలిపారు. ఇక గర్భధారణ సమయంలో వికారంగా ఉండడం సహజమేనని చాలా మంది చెప్తుంటారు. అంతేకాక గర్భధారణ సమయంలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా సహజం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: