పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే...

VAMSI
ఒక ఇంటిలో కుటుంబ నిర్వహణ అంతా తల్లి చేతిలో ఉంటుంది. అదే విధంగా పిల్లల పెంపకం వారి బాధ్యత అంతా కూడా తల్లి చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా తమ బిడ్డలను పుట్టిన నాటి నుండి కనీసం పది సంవత్సరాల వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలసి ఉంటుంది. అది వారి ఆరోగ్యం గురించి అయినా కావొచ్చు. లేదా మరేతర విషయమైనా కావొచ్చు. పిల్లల విషయాల్లో తల్లి పాత్ర చాలా కీలకంగా మారుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కరోనా సమయం కావడం వలన మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వయసుకు తగినట్లుగా ఆహార నియమాలను పాటించాలి. ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యాన్ని పరీక్ష చేయిస్తూ ఉండాలి.
కనీసం ఎటువంటి జలుబు లేదా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల డాక్టర్ ను సంప్రదించాలి. అత్యవసరం అయితే తప్ప పిల్లలకు బయటకు పంపడం చేయకూడదు.  పరిశుభ్రత పై చిన్న వయసు నుండి వారికి అవగాహన కల్పించాలి. శుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలను వివరించాలి. ఆరోగ్యం యొక్క ప్రయోజనాన్ని తెలియజెప్పాలి. ఒక మల్లయోధుడు కన్నా పరిపూర్ణ ఆరోగ్య వంతుడు బలవంతుడు అని చెప్పాలి. ఒక వేళ అనుకోకుండా బయటకు వెళితే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాస్క్ తీయకుండా జాగ్రత్తపడాలి అని చెప్పాలి.
సమాజంలో ప్రస్తుతం ఉండే చెడు వాటికి అలవాటు పడకుండా వాటి నష్టాలను ఉదాహరణలతో తెలియచేసి వాటిపై ఆలోచింపచేయాలి. సమాజానికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో నేర్పించాలి. ఇలా మీ పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో మీ బాధ్యత కనిపించాలి. ఏ మాత్రం అజాగ్రత్త చూపినా వారి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. రేపు మీ పిల్లలు వివిధ కారణాల వలన అయినా ఎక్కడ ఉన్నా భయపడే పరిస్థితి ఉండకూడదు. ఒక మంచి మనిషిని ఈ సమాజానికి అందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: